టిడిపిః తమ్ముళ్ళల్లో ‘సుప్రిం’ కలవరం

First Published Mar 6, 2017, 12:12 PM IST
Highlights

పున్నమి ఘాట్ లో చంద్రాబాబు పలువురు జడ్జ్ లకు భ్రహ్మాండమైన వింధు ఇచ్చారు. అందులో సుప్రింకోర్టు జడ్జీలు కూడా ఉన్నారు.  అయినా చంద్రబాబుకు సుప్రింకోర్టు నుండి నోటీసులు అందటమేమిటని తమ్ముళ్ళను బాగా వేధిస్తోంది.

తెలుగుదేశం పార్టీలో ఓటుకునోటు కలకలం మొదలైంది. ఓటుకునోటు కేసుకు తమ అధినేత సమర్ధవంతంగా సమాధి కట్టేసారని తమ్ముళ్ళు ఇంత కాలం అనుకుంటున్నారు. అటువంటిది ఒక్కసారిగా సుప్రింకోర్టు చేసిన వ్యాఖ్యలతో పార్టీ నేతలు ఖంగుతిన్నారు. ఓటుకునోటు కేసు అవినీతి నిరోధక చట్టం క్రిందకే రాదని చంద్రబాబు న్యాయవాది ఇంతకాలం చేస్తున్న వాదనలను కోర్టు కొట్టేసింది. ఈ కేసు ఖచ్చితంగా అవినీతి నిరోధక చట్టం క్రిందకే వస్తుందని స్పష్టం చేసింది. అదేవిధంగా, ఈ కేసుతో పిటీషనర్ కు ఎటువంటి సంబంధం లేదని న్యాయవాధి వాదిస్తున్నారు. ఆ వాదనను కూడా కోర్టు కొట్టేసింది. అవినీతిని ఎవరైనా ప్రశ్నించవచ్చని స్పష్టం చేసింది. కాకపోతే కేసులో మెరిట్ ఉందా లేదా అని మాత్రమే కోర్టులు చూడాలని కూడా చెప్పింది.

 

పిటీషనర్ దాఖలు చేసిన కేసును విచారణకు స్వీకరిస్తున్నట్లు న్యాయవాదులు చెప్పటమంటే చంద్రబాబుకు ఇబ్బందులు మొదలైనట్లే. ఎందుకంటే, పిటీషనర్ వాదనపై నాలుగు వారాల్లో కౌంటర్ వేయాలంటూ కోర్టు చంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది. సుప్రింకోర్టు వ్యాఖ్యలతో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఏదో అయిపోతుందన్న భ్రమలు ప్రజల్లో లేకపోయినా కేసుకు ఒక లాజికల్ ఎండ్ అయితే రావచ్చని అనుకుంటున్నారు. అంటే, కేసులో ఇప్పటికైనా పురోగతి కనబడుతుందని భావిన్నారు.

 

కెసిఆర్-చంద్రబాబుల మద్య ఉన్నతస్ధాయిలో జరిగిన తెరవెనుక ఒప్పందాల వల్లే కేసు విచారణ ఇంతకాలమూ నత్తనడక నడుస్తోందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ కేసు ఫలితంగానే చంద్రబాబు పదేళ్ల ఉమ్మడి రాజధానైన హైదరాబాద్ ను అర్ధాంతరంగా వదిలిపెట్టేసారన్నది బహిరంగ రహస్యమే. ఇటీవలే విజయవాడలోని పున్నమి ఘాట్ లో చంద్రాబాబు పలువురు జడ్జ్ లకు భ్రహ్మాండమైన వింధు ఇచ్చారు. అందులో సుప్రింకోర్టు జడ్జీలు కూడా ఉన్నారు.  అయినా చంద్రబాబుకు సుప్రింకోర్టు నుండి నోటీసులు అందటమేమిటని తమ్ముళ్ళను బాగా వేధిస్తోంది.

click me!