చంద్రబాబుః స్పష్టంగా కనబడుతున్న అసహనం

First Published Mar 6, 2017, 7:55 AM IST
Highlights

మీడియా సంధించిన ప్రశ్నకు సమాధానం చెప్పేటప్పుడు చంద్రబాబులో ఆందోళన స్పష్టంగా కనబడింది.

‘తనపై కేసులు దాఖలు చేయటం సహజమే’. ‘ఇప్పటికే నాపై 26 కేసులున్నాయ్’. ‘కొట్టేసిన కేసులను కూడా మళ్ళీ మళ్ళీ తిరగదోడుతున్నారు’. ఆ కేసుల్లో విషయమేలేదట. ఇవన్నీ ఓటుకునోటు కేసులో సుప్రింకోర్టు నోటీసులు ఇచ్చిన తర్వాత చంద్రబాబు రియాక్షన్. ఓవైపు తీవ్ర అసహనం. మరోవైపు ఉక్రోషం. ఓటుకు నోటు కేసులో తాజా పరిణామాలపై మీడియా ప్రశ్నలకు ఏ విధంగా స్పందించాలో చంద్రబాబుకు అర్ధంకాలేదు. మీడియా సంధించిన ప్రశ్నకు సమాధానం చెప్పేటప్పుడు చంద్రబాబులో ఆందోళన స్పష్టంగా కనబడింది. దాన్ని కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబు పై విధంగా స్పందించినట్లు కనబడుతోంది.

 

ఈ కేసు విషయంలో చంద్రబాబు తీవ్ర ఆందోళనలో ఉన్నారన్నది వాస్తవం. అసలు కేసు విచారించమని  కోరే అధికారమే పిటీషనర్ కు లేదంటూ చంద్రబాబు పదే పదే వాదిస్తున్నారంటేనే చంద్రబాబు పరిస్ధితి అర్ధమవుతోంది. ఓటుకు నోటు కేసు వాస్తవం. అందులో చంద్రబాబు తరపునే టిటిడిపి ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి డబ్బులు ఇవ్వచూపింది అంతకంటే వాస్తవం. ఎందుకంటే, నామినేటెడ్ ఎంఎల్ఏ స్టీఫెన్ సన్ కు డబ్బులిస్తూ రేవంత్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. అందుకు వీడియో, ఆడియోలే సాక్ష్యాలు. అయితే, ఇందులో ఎక్కడా చంద్రబాబు పాత్రపై ప్రత్యక్ష్య ఆధారాలు లేవు. కానీ, తర్వాత చంద్రబాబు-స్టీఫెన్ ల మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు వెలుగు చూడటంతో దేశంలో సంచలనం రేగింది.  

 

ఇక్కడే పిటీషనర్ ఆళ్ళ రామకృష్ణారెడ్డి రంగప్రవేశం చేసారు. ఎందుకంటే, ఫోన్ సంభాషణల్లో గొంతు తనదా కాదా అన్న విషయమై మీడియా ఎన్నిమార్లు ప్రశ్నించినా చంద్రబాబు నుండి స్పష్టమైన సమాధానం లేదు. ఎంతసేపు ఫోన్ సంభాషణలను రికార్డు చేసే అధికారం, ఫోన్లను ట్యాప్ చేసే అధికారం ఎవరికీ లేదంటారే తప్ప నేరుగా సమాధానం చెప్పరు. ఇక్కడే చంద్రబాబు పాత్రపై అందరికీ అనుమానాలు మొదలయ్యాయి. అందుకనే ఓటుకునోటు కేసులో చంద్రబాబు పాత్రను తేల్చాలని ఆళ్ళ కోర్టుకెక్కారు.

 

అయితే  అసలు ఆళ్ళకు కేసు వేసే అధికారమే లేదంటూ చంద్రబాబు కొత్త వాదన లేవనెత్తారు. అంతేకాకుండా అసలు కేసును విచారించే అధికారమే ఎవరికీ లేదన్నట్లుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. మొత్తానికి ఆళ్ళ కేసును హై కోర్టు కొట్టేసింది. వెంటనే ఆయన  సుప్రింకోర్టును ఆశ్రయించారు. పిటీషనర్ వాదనతో సుప్రింకోర్టు ఏకీభవించటమే కాకుండా చంద్రబాబుకు నోటీసులు కూడా జారీ చేసింది. దాంతో టిడిపిలో అలజడి మొదలైంది.

 

click me!