హిజ్రాతో దోస్తీ: మద్యం తాగించి చంపాడు

Published : Mar 21, 2021, 03:03 PM IST
హిజ్రాతో దోస్తీ: మద్యం తాగించి చంపాడు

సారాంశం

జిల్లాలోని హిందూపురం పట్టణ సమీపంలో కొట్నూరు జాతీయ రహదారిపై  ట్రాన్స్ జెండర్ నిహరిక దారుణ హత్యకు గురైంది.పరిగి మండలం యర్రగుంటపల్లి చెందిన ట్రాన్స్‌జెండర్‌ నిహారిక హిందూపురంలోని ఇందిరమ్మ కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకుని భిక్షాటనతో జీవనం సాగిస్తోంది.  

అనంతపురం: జిల్లాలోని హిందూపురం పట్టణ సమీపంలో కొట్నూరు జాతీయ రహదారిపై  ట్రాన్స్ జెండర్ నిహరిక దారుణ హత్యకు గురైంది.పరిగి మండలం యర్రగుంటపల్లి చెందిన ట్రాన్స్‌జెండర్‌ నిహారిక హిందూపురంలోని ఇందిరమ్మ కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకుని భిక్షాటనతో జీవనం సాగిస్తోంది.

కొంత కాలంగా అదే గ్రామానికి చెందిన రాజశేఖర్‌ ఆమెతో చనువుగా ఉంటోంది.. ఈ క్రమంలోనే నిహారిక తాను దాచుకున్న రూ. 3లక్షలను రాజశేఖర్‌కు అందజేసింది. శుక్రవారం రాత్రి కొట్నూరు జాతీయ రహదారిపై రాజశేఖర్, నిహారిక కలిసి మద్యం సేవించి ఘర్షణ పడ్డారు. ఆ సమయంలో కత్తితో నిహారిక గొంతును రాజశేఖర్‌  కోసేశాడు. 

అనంతరం మృతదేహంపై పెట్రోల్‌ పోసి నిప్పంటించి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు శనివారం ఉదయం ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు సీఐ బాలమద్దిలేటి తెలిపారు.
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే