తిరుపతి ఉప ఎన్నిక... బిజెపి పార్లమెంట్, అసెంబ్లీల ఇంచార్జీల నియామకం

Arun Kumar P   | Asianet News
Published : Mar 21, 2021, 02:55 PM ISTUpdated : Mar 21, 2021, 03:04 PM IST
తిరుపతి ఉప ఎన్నిక... బిజెపి పార్లమెంట్, అసెంబ్లీల ఇంచార్జీల నియామకం

సారాంశం

తిరుపతి ఉప ఎన్నికలో గెలుపు కోసం రెండంచెల కమిటీని ఏర్పాటు చేస్తామని వీర్రాజు పేర్కొన్నారు. 

తిరుపతి ఉప ఎన్నికల నేపధ్యంలో ఎన్నికల భారతీయ జనతా పార్టీ ప్రచార కమిటీని ప్రకటించింది. అభ్యర్థి ప్రకటన అనంతరం బిజెపి-జనసేన ముఖ్య నాయకులు భేటి అవుతారని... ఆ తర్వాత ఇరుపార్టీల ప్రచార కమిటీ ప్రకటిస్తామని బిజెపి చీఫ్ సోము వీర్రాజు వెల్లడించారు. 

తిరుపతి ఉప ఎన్నికలో గెలుపు కోసం రెండంచెల కమిటీని ఏర్పాటు చేస్తామని వీర్రాజు పేర్కొన్నారు. తిరుపతి పార్లమెంట్ కమిటీ పార్లమెంట్ ఇంచార్జిగా ఆదినారాయణ రెడ్డిని నియమిస్తున్నట్లు వీర్రాజు తెలిపారు. ఇక ఈ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీలకు కూడా ఇంచార్జీలను నియమించారు. 

ప్రచార కమిటీ ఇదే:

వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన వాలంటీర్ల కోసం ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని మండిపడ్డారు.

వాలంటీర్ల కోసం నెలకు రూ.310 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోందని వీర్రాజు తెలిపారు. నవరత్నాల కోసం ఏర్పాటైన వ్యవస్థ ఎన్నికలను నిరోధిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని వీర్రాజు హెచ్చరించారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే