విశాఖలో విషాదం.. రుషికొండ బీచ్‌లో విద్యార్ధుల గల్లంతు

Siva Kodati |  
Published : Mar 12, 2022, 06:26 PM IST
విశాఖలో విషాదం.. రుషికొండ బీచ్‌లో విద్యార్ధుల గల్లంతు

సారాంశం

విశాఖ రుషికొండ బీచ్‌లో ముగ్గురు విద్యార్ధులు గల్లంతవ్వడంతో విషాదం చోటు చేసుకుంది. వీరిలో ఒకరి మృతదేహం వెలికి తీయగా.. గల్లంతైన మరో విద్యార్ధి కోసం పోలీసులు  గాలిస్తున్నారు. 

విశాఖ (visakhapatnam) రిషికొండ బీచ్‌లో (rushikonda beach) విషాదం చోటు చేసుకుంది. స్నేహితుడి బర్త్ డే సందర్భంగా బీచ్‌కు వెళ్లారు ఆరుగురు విద్యార్ధులు. వీరిలో ముగ్గురు గల్లంతవ్వగా .. వీరిలో ఒకరి మృతదేహాన్ని వెలికి తీశారు. మరో విద్యార్ధి పరిస్ధితి విషమంగా వుండటంతో ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విద్యార్ధులు స్థానిక మారిక వలస పరదేశీపాలెంవాసులుగా గుర్తించారు పోలీసులు. కేసు నమోదు చేసుకున్న ఆరిలోవా పోలీసులు  దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన విద్యార్ధిని పార్ధుగా (15)గా గుర్తించారు. గల్లంతైన విద్యార్ధి కోసం పోలీసులు, కోస్ట్ గార్డ్ సిబ్బంది గాలిస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Chandrababu, Lokesh కి వెంకన్న ప్రసాదం ఇచ్చిన టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ | Asianet News Telugu
నారావారిపల్లెలో CM Chandrababu Family గంగమ్మ, నాగాలమ్మకు ప్రత్యేక పూజలు | Asianet News Telugu