జంగారెడ్డిగూడెంలో వరుస మరణాలు.. ఇలాంటి వాటి కోసమే వెతుకుతుంటారు: టీడీపీపై పేర్ని నాని విమర్శలు

Siva Kodati |  
Published : Mar 12, 2022, 02:43 PM IST
జంగారెడ్డిగూడెంలో వరుస మరణాలు.. ఇలాంటి వాటి కోసమే వెతుకుతుంటారు: టీడీపీపై పేర్ని నాని విమర్శలు

సారాంశం

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో వరుస మరణాలు చోటు చేసుకుంటున్న ఘటనపై మంత్రి పేర్ని నాని దర్యాప్తుకు ఆదేశించారు. ఇదే సమయంలో ఆయన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీపైనా విమర్శలు చేశారు. టీడీపీకి శవ  రాజకీయాలు అలవాటైపోయాయంటూ దుయ్యబట్టారు.  

పశ్చిమ గోదావరి జిల్లా (west godavari district) జంగారెడ్డిగూడెంలో (jangareddygudem) వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి పేర్ని నాని (perni nani) ఈ వ్యవహారంపై ఆరా తీశారు. కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్‌తో వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఏ ఘటన జరిగినా చంద్రబాబు వెతుక్కుంటున్నారని ఆయన మండిపడ్డారు. టీడీపీకి శవ రాజకీయాలు చేయడం అలవాటైపోయిందని పేర్ని నాని ఆరోపించారు. ప్రాథమిక విచారణ జరిగిందని.. ఈ రోజు రెండు మరణాలు సంభవించాయని మంత్రి చెప్పారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక వాస్తవాలు వెలుగు చూస్తాయని పేర్ని నాని తెలిపారు. పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని జిల్లా కలెక్టర్‌కు మంత్రి పేర్ని నాని ఆదేశించారు. 

కాగా.. రెండు రోజుల్లో (బుధ,  గురువారాల్లో) 15 మంది మృతి చెందడం పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో కలకలం సృష్టిస్తోంది. అప్పటి వరకూ ఆరోగ్యంగా ఉన్నవారు ఒక్కసారిగా అస్వస్థతకు గురై మృత్యువాత పడటం Mysteryగా మారింది. కొందరిలో 
Vomiting, diarrhea, abdominal pain వంటి లక్షణాలతో ఆస్పత్రిలో చేరడం..  గంటల వ్యవధిలో మృతి చెందడం విషాదం మిగుల్చుతోంది. 

వీరిలో ఎక్కువ మందికి Alcohol అలవాటు ఉందని... కల్తీసారా తాగి చనిపోయారని కొందరు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మృతుల్లో ఒకరిద్దరు 60 నుంచి 70 ఏళ్ల వారు కాగా మిగిలిన వారు నలభై నుంచి యాభై ఐదు సంవత్సరాల మధ్య వయస్కులు. వీరంతా కూలి పనులు, చిన్న వృత్తులు చేసుకునే వారు. వీరిలో కొందరికి కుటుంబసభ్యులు ఆర్ఎంపీలు, పీఎంపీల వద్ద, మరికొందరిని ప్రాంతీయ ఆసుపత్రి, ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చి వైద్యం అందించారు. బుట్టాయగూడెం రోడ్డులోని గాంధీ బొమ్మ సెంటర్ లోని ఓకే వీధిలో ఇద్దరు చనిపోయారు. 

‘మా నాన్న ముడిచర్ల అప్పారావు (45) కడుపు నొప్పి.. అంటే ఆర్ఎంపీ వద్ద చూపించాం. తరువాత పట్టణంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకు వెళ్లాం. కొద్దిసేపటికి మా నాన్న చనిపోయారు’ అని ప్రకాష్ ఆవేదన వ్యక్తం చేశారు. తాపీ పనులు చేసే బండారు శ్రీనివాసరావు (45) కడుపునొప్పితో బాధపడితే గురువారం ఉదయం ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకువెళ్లినట్లు ఆయన మేనల్లుడు వెంకట తెలిపారు. ‘వాంతులు, విరేచనాలు అయ్యాయి.  ఐసీయూలో పెట్టారు. కొద్దిసేపటికే మామయ్య చనిపోయారు అని చెప్పారు’  అని అన్నారు. అత్యధిక మరణాలు ఇదే తీరులో సంభవించినట్లు చెబుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

“ఆవకాయ్ అమరావతి” Festival Announcement | Minister Kandula Durgesh Speech | Asianet News Telugu
Nara Bhuvaneshwari Launches Free Mega Medical Rampachodavaram Under NTR Trust | Asianet News Telugu