దుర్గగుడిలో అక్రమాలు.. సర్కార్‌ యాక్షన్, ఇప్పటి వరకు 26 మందిపై వేటు

By Siva KodatiFirst Published Feb 23, 2021, 9:30 PM IST
Highlights

విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో జరిగిన అక్రమాలపై ఏసీబీ దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. అవినీతి నిరోధక శాఖ ఇచ్చిన నివేదిక తర్వాత ప్రభుత్వం సిబ్బందిపై చర్యలకు ఉపక్రమించింది. 

విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో జరిగిన అక్రమాలపై ఏసీబీ దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. అవినీతి నిరోధక శాఖ ఇచ్చిన నివేదిక తర్వాత ప్రభుత్వం సిబ్బందిపై చర్యలకు ఉపక్రమించింది.

దీంతో ఉదయం నుంచి ఒక్కొక్కరిపై సస్పెన్షన్ వేటు వేస్తోంది ప్రభుత్వం. అది సాయంత్రం కూడా కొనసాగింది. అధికారిక సమాచారం ప్రకారం ఇప్పటి వరకు 26 మంది దుర్గగుడి ఆలయ సిబ్బందిపై వేటు వేసింది.

వీరిలో ఆరుగురు సూపరింటెండెంట్లు, 15 మంది సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, రికార్డు అసిస్టెంట్లు వున్నారు. అలాగే అన్నదాన విభాగంలో మరో కాంట్రాక్ట్ సిబ్బందిపైనా ప్రభుత్వం వేటు వేసింది.

Also Read:దుర్గగుడిలో మరో ఇద్దరి సస్పెన్షన్: 15 మంది ఉద్యోగులపై వేటు

ప్రతి విభాగంలోనూ సూపరింటెండెంట్, ఇతర సిబ్బందిపైనా ప్రభుత్వం కొరడా ఝళిపించింది. అయితే రేపు మరింత మంది దుర్గగుడి సిబ్బందిపైనా ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. 

కాగా, సెక్యూరిటీ టెంటర్ల విషయంలో ఈవో సురేశ్ పాత్రపై ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు దేవాదాయ శాఖ కమీషనర్. సెక్యూరిటీ సంస్థకు టెండర్ల విషయంలో దేవాదాయ శాఖ కమీషనర్ ఆదేశాలను ఈవో బేఖాతరు చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

3 వెండి సింహాలు చోరీ జరిగినా మాక్స్ సంస్థకు టెండర్లు కట్టబెట్టడంతో ఈవోపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో సురేశ్‌పై శాఖాపరమైన విచారణ జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

click me!