చిరిగిన జగన్మోహన్ రెడ్డి ప్లెక్సీ.. కేసు నమోదు చేసిన పోలీసులు

By narsimha lodeFirst Published Oct 15, 2019, 10:20 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ట్మాతకంగా చేపడుతున్న మరో కార్యక్రమం 'వైఎస్ఆర్ కంటి వెలుగు'. ఈ  కార్యక్రమాన్ని   సీఎం జగన్ మోహన్ రెడ్డి అనంతపురంలో ప్రారంభించారు.కంటి వెలుగు పథకాన్ని ఆయా జిల్లాలొ ఆయా మంత్రులు ఈ ఫథకాన్ని ప్రారంభించారు.  ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పురష్కరించుకుని అదికారులు ప్లుక్సీని ఏర్పాటు చేశారు.అయితే తూర్పగోదావరి జిల్లా రాయవరం మండలంలోని వెంటూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ఫ్టెక్సీని కొందరు వ్యక్తులు చింపివేశారు. దీంతో పోలీసులు ఈ ఘటనపై విచారణ జరిపి  నిందుతులపై కేసు నమోదు చేశారు. 

రాయవరం: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ఫ్లెక్సీని గుర్తుతెలియని వ్యక్తులు చించివేసిన సంఘటనపై కేసు నమోదైంది. ఫ్లెక్సి చింపిన వ్యక్తులపై  కేసు రిజిస్టర్ చేసినట్లుగా రాయవరం హెచ్ సి పి బాలసుబ్రమణ్యం సోమవారం విలేఖర్లకు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని గ్రామ పంచాయతీ వద్ద రాష్ట్ర ప్రభుత్వ పథకాలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటో తో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు, 

ఆ ఫ్లెక్సీని గుర్తుతెలియని వ్యక్తులు శనివారం రాత్రి చించివేశారు, ఘటనపై పంచాయతీ కార్యదర్శి డి శ్రీనివాసరావు రాయవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఆ ఫిర్యాదు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ బాలసుబ్రమణ్యం తెలిపారు.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ట్మాతకంగా చేపడుతున్న మరో కార్యక్రమం 'వైఎస్ఆర్ కంటి వెలుగు'. ఈ  కార్యక్రమాన్ని   సీఎం జగన్ మోహన్ రెడ్డి అనంతపురంలో ప్రారంభించారు. కంటి వెలుగు పథకాన్ని ఆయా జిల్లాలొ ఆయా మంత్రులు ఈ ఫథకాన్ని ప్రారంభించారు.  ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పురష్కరించుకుని అదికారులు ప్లుక్సీని ఏర్పాటు చేశారు.

అయితే తూర్పగోదావరి జిల్లా రాయవరం మండలంలోని వెంటూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ఫ్టెక్సీని కొందరు వ్యక్తులు చింపివేశారు. దీంతో పోలీసులు ఈ ఘటనపై విచారణ జరిపి నిందుతులపై కేసు నమోదు చేశారు. 

click me!