వివేకా హత్యకేసు ముద్దాయిలు జగన్ కు తెలుసు: వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు

Published : Oct 14, 2019, 06:05 PM IST
వివేకా హత్యకేసు ముద్దాయిలు జగన్ కు తెలుసు: వర్ల  రామయ్య సంచలన వ్యాఖ్యలు

సారాంశం

వివేకా హత్య కేసులో నిందితులు సీఎం జగన్ కు తెలుసుకాబట్టే సీబీఐ దర్యాప్తు కోరడం లేదన్నారు. వివేకాను ఎవరు హత్య చేయించారో పులివెందుల ప్రజలకు సైతం తెలుసునని చెప్పుకొచ్చారు. 

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు తెలుగుదేశం పార్టీ కీలక నేత వర్ల రామయ్య. జగన్ చిన్నాన్న, మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ముద్దాయిలు సీఎం జగన్ కు తెలుసునన్నారు. 

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును తారుమారు చేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ కేసుతో సంబంధం లేని వారిని నిందితులుగా చూపబోతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

వివేకా హత్య కేసులో నిందితులు సీఎం జగన్ కు తెలుసుకాబట్టే సీబీఐ దర్యాప్తు కోరడం లేదన్నారు. వివేకాను ఎవరు హత్య చేయించారో పులివెందుల ప్రజలకు సైతం తెలుసునని చెప్పుకొచ్చారు. పోలీసులు తమ నీతి నిజాయితీ చూపించుకునే కేసు వివేకా హత్యకేసు అని చెప్పుకొచ్చారు. 

ఈ కేసులో డీజీపీ తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సూచించారు. సీఎం సొంత చిన్నాన్న హత్య కేసును ఎందుకు తాత్సారం చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసు గురించి తెలుసుకునే హక్కు ఒక పౌరుడిగా తనకు ఉందన్నారు. కేసును మసిపూసి మారేడు కాయ చేస్తే చూస్తూ ఊరుకోబోమని వర్ల రామయ్య హెచ్చరించారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu