మోహన్ బాబుతో ముద్రగడ భేటీ.. ఆంతర్యం..?

By ramya neerukondaFirst Published Jan 28, 2019, 12:42 PM IST
Highlights

సినీ నటుడు మోహన్ బాబుని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కలవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

సినీ నటుడు మోహన్ బాబుని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కలవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పాలకొల్లు పట్టణంలో సినీ దర్శకుడు దాసరి నారాయణ రావు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మోహన్ బాబు శనివారం వచ్చారు. కాగా.. ఆదివారం ఆయనను పట్టణ కాపు నాయకుడు ముచ్చర్ల శ్రీరాం నివాసంలో ముద్రగడ ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

రాజకీయాల గురించి మేము చర్చించుకోలేదు.. సాధారణ భేటీనే అని ఇరువురూ చెబుతున్నప్పటికీ.. వీరి భేటీ రాజకీయంగా కలకలం రేపుతోంది. ప్రస్తుతం  ఏపీ రాజకీయాల్లో మారుతున్న పరిణామాల దృష్ట్యా..మోహన్‌బాబు, పద్మనాభంల మధ్య ఎటువంటి చర్చలు జరిగాయా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల సమయం కావడంతో రాజకీయపరంగా వీరిద్దరి భేటీ హాట్‌ టాపిక్‌ అయింది.

ఈ భేటీలో.. దాసరి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముద్రగడను ఆహ్వానించకపోవడంపై మోహన్ బాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ముద్రగడ.. దాసరి నారాయణరావుకి సన్నిహితులు అని ఈ సందర్భంగా మోహన్ బాబు గుర్తు చేసుకున్నారు. 

related news

ముద్రగడకు అందని ఆహ్వానం.. మోహన్ బాబు ఫైర్

click me!