చంద్రబాబుకు కౌంటర్: జగన్ బీసీ గర్జన

Published : Jan 28, 2019, 12:12 PM IST
చంద్రబాబుకు కౌంటర్: జగన్ బీసీ గర్జన

సారాంశం

టీడీపీ నిర్వహించిన బీసీ గర్జనకు పోటీగా  వైసీపీ కూడ బీసీ గర్జన నిర్వహించాలని  భావిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 19వ తేదీన ఏలూరులో ఈ సభను ఏర్పాటు చేయాలని ఆ పార్టీ భావిస్తోంది.

హైదరాబాద్:టీడీపీ నిర్వహించిన బీసీ గర్జనకు పోటీగా  వైసీపీ కూడ బీసీ గర్జన నిర్వహించాలని  భావిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 19వ తేదీన ఏలూరులో ఈ సభను ఏర్పాటు చేయాలని ఆ పార్టీ భావిస్తోంది. ఈ మేరకు జగన్‌తో సోమవారం నాడు బీసీ నేతలు పార్టీ కార్యాలయంలో  సమావేశమయ్యారు.

ఫిబ్రవరి మూడో వారంలో  ఏపీలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.ఈ తరుణంలోనే టీడీపీ ఆదివారం నాడు  జయహో బీసీ పేరుతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ వేదికపై నుండి వైఎస్‌ఆర్‌పై, వైసీపీపై చంద్రబాబునాయుడు విమర్శలు గుప్పించారు. బీసీలకు టీడీపీ ఏ రకంగా న్యాయం చేసిందనే  విషయాన్ని బాబు వివరించారు.

ఫిబ్రవరి 19వ తేదీన ఏలూరులో బీసీ గర్జనను నిర్వహించాలని వైసీపీ భావిస్తోంది. రాష్ట్రంలోని 13 జిల్లాలో బీసీ సమస్యలపై అధ్యయనం చేసిన పార్టీ నేతల బృందం సోమవారం నాడు  జగన్‌తో లోటస్‌పాండ్‌లో సమావేశమైంది.

ఇప్పటికే వైసీపీ ప్రకటించిన నవరత్నాల్లో  బీసీలకు  మరిన్ని పథకాలను ప్రకటించే యోచనలో  ఆ పార్టీ ఉంది. ఈ విషయమై పార్టీ నేతలతో జగన్ చర్చిస్తున్నారు..

ఏలూరులో సభ నిర్వహణ వల్ల ప్రయోజనం లేదని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఏలూరు కాకపోతే మరో ప్రాంతంలో ఈ సభను ఏర్పాటు చేసే అవకాశం లేకపోలేదు.
 

PREV
click me!

Recommended Stories

Sankranti Weather : తెలుగోళ్ళకు గుడ్ న్యూస్.. సంక్రాంతి పండక్కి సరైన వెదర్
Odisha Governor Kambhampati Hari Babu Speechవిశాఖలో ఘనంగా మహా సంక్రాంతి వేడుకలు| Asianet News Telugu