పరిటాల శ్రీరామ్ ఎంట్రీ: కొడుకు కోసం నిమ్మల కిష్టప్ప సైతం

Published : Jan 28, 2019, 12:26 PM ISTUpdated : Jan 28, 2019, 12:29 PM IST
పరిటాల శ్రీరామ్ ఎంట్రీ: కొడుకు కోసం నిమ్మల కిష్టప్ప సైతం

సారాంశం

: చంద్రబాబునాయుడు ఆదేశిస్తే పుట్టపర్తి లేదా పెనుకొండ అసెంబ్లీ స్థానాల నుండి తాను పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నానని హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప స్పష్టం చేశారు.  


అనంతపురం: చంద్రబాబునాయుడు ఆదేశిస్తే పుట్టపర్తి లేదా పెనుకొండ అసెంబ్లీ స్థానాల నుండి తాను పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నానని హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప స్పష్టం చేశారు.

సోమవారం నాడు ఆయన అనంతపురంలో మీడియాతో మాట్లాడారు.అవసరమనుకొంటే తన కొడుకు శిరీష్ కూడ పోటీకి సిద్దంగా ఉంటాడని నిమ్మల కిష్టప్ప ప్రకటించారు. హిందూపురం పార్లమెంట్ స్థానం నుండి  మంత్రి పరిటాల సునీత తనయుడు  పరిటాల శ్రీరామ్ పోటీ చేస్తారని  ప్రచారం సాగుతున్న తరుణంలో నిమ్మల కిష్టప్ప వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి.

తాను గతంలో ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించినట్టుగా నిమ్మల కిష్టప్ప గుర్తు చేశారు. ప్రస్తుతం ఎంపీగా పనిచేస్తున్నట్టు చెప్పారు. అయితే తాను ఎక్కడి నుండి పోటీ చేయాలనే విషయమై చంద్రబాబునాయుడు నుండి స్పష్టత రావాల్సి ఉందని ఆయన చెప్పారు.
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : టమాటా టార్గెట్ సెంచరీ..? మిర్చీ హాఫ్ సెంచరీ..? : హైదరాబాద్ లో ఏ కూరగాయ ధర ఎంతో తెలుసా?
IMD Cold Wave Alert : చలి తగ్గినా ఈ ప్రమాదం ఇంకా పొంచివుంది.. తస్మాత్ జాగ్రత్త