జగన్ వెంటే మేమంటున్న టాలీవుడ్ స్టార్స్!

First Published Feb 19, 2019, 4:54 PM IST

ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ కి సినీ మద్దతు రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇటీవల ప్రజా సంకల్ప యాత్ర పేరిట జగన్ పాదయాత్ర చేపట్టగా.. ఆ యాత్రలో కొందరు సినీతారలు.. ఆయన వెంట అడుగులు వేశారు. 

ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ కి సినీ మద్దతు రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇటీవల ప్రజా సంకల్ప యాత్ర పేరిట జగన్ పాదయాత్ర చేపట్టగా.. ఆ యాత్రలో కొందరు సినీతారలు.. ఆయన వెంట అడుగులు వేశారు. తాజాగా.. లోటస్ పాండ్ లోని ఆయన నివాసానికి వెళ్లి మరీ.. కొందరు తారలు ఆయన్ని కలుస్తున్నారు. వచ్చేవి ఎన్నికలు రోజులు కావడంతో ఈ భేటీలు ఆసక్తికరంగా మారాయి.
undefined
సినీ నటుడు అక్కినేని కుటుంబానికి మొదటి నుంచి వైఎస్ కుటుంబంతో సత్సంబంధాలే ఉన్నాయి. వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో వీరికి రాకపోకలు ఉండేవి. తాజాగా.. ఈ అనుబంధాన్ని జగన్ కూడా కొనసాగిస్తున్నారు. మంగళవారం నాగార్జున జగన్ నివాసానికి వెళ్లి మరీ కలిశారు. వీరి కలయిక ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
undefined
కమిడియన్ అలీ కూడా వైసీపీలో చేరుతున్నారనే ప్రచారం ఆ మధ్య బాగా జరిగింది. ఆయన ఎయిర్ పోర్టులో జగన్ ని కలవడమే అందుకు కారణం. అయితే.. ఆ తర్వాత ఆయన వెంటనే పవన్ కళ్యాణ్ ని, ఆ తర్వాత చంద్రబాబుని కలవడంతో.. ఏ పార్టీలో చేరుతున్నారనే గందరగోళం నెలకొంది
undefined
నిన్నటికి నిన్న.. జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు కూడా జగన్ ని కలిశారు. ఎప్పుడైతే ఎన్టీఆర్ ని చంద్రబాబు పార్టీకి దూరంగా పెట్టాడో.. అప్పటి నుంచి నార్నె కూడా టీడీపీ దూరంగా ఉండటం మొదలుపెట్టాడు. తాజాగా జగన్ ని నార్నె కలవడంతో.. ఎన్టీఆర్ కూడా జగన్ కి మద్దతు తెలుపుతున్నారా అనే సందేహాలు మొదలయ్యాయి.
undefined
సీనియర్ నటుడు భానుచందర్ తాజాగా.. వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు
undefined
కమెడియన్ థర్టీ ఇయర్స్ పృథ్వి కూడా మధ్యలో జగన్ ని కలిసి తన మద్దతు జగన్ కి ఇస్తున్నట్లు తెలిపారు. అంతే కాక రానున్న ఎన్నికల్లో విజయం సాధించి తీరుతారని అన్నారు. పృథ్వికి వైసీపీ నుంచి టికెట్ దక్కే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
undefined
క్యారెక్టర్ ఆర్టిస్ట్,రచయిత, దర్శకులు పోసాని కృష్ణమురళి ఇప్పటికే తన మద్దతు వైసిపి కి ఉంటుందని, రానున్న ఎన్నికల్లో వైసిపి విజయం ఖాయమని, జగన్ ప్రజా ఆమోదంతో తప్పక విజయం సాధించి ముఖ్యమంత్రి అవుతారని అన్నారు.
undefined
ఇటీవలే మంచు విష్ణు కూడా.. జగన్ ని ఆయన నివాసంలో కలిశారు. వీరి భేటీ కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే.. విష్ణు భార్య వెరోనికా.. జగన్ కి దగ్గరి బంధువు అవ్వడంతో కలిశారనే వార్తలు కూడా వచ్చాయి.
undefined
కమిడియన్ ఫిష్ వెంకట్ కూడా వైసీపీ కండువా కప్పుకొని జగన్ వెంటే తాను నడుస్తున్నట్లు చెప్పారు
undefined
అక్కినేని ఫ్యామిలీ మరో హీరో సుమంత్ కూడా.. జగన్ కి తన మద్దతు తెలిపారు. వీరిద్దరూ చదువుకునే రోజుల్లో క్లాస్ మెట్స్. కాగా.. జగన్ పాదయాత్ర సమయంలో సుమంత్ స్వయంగా వెళ్లి తన మద్దతు తెలిపారు.
undefined
కెమెరామాన్ చోట కే నాయుడు జగన్ ను కలిసి తన మద్దతు తెలిపారు. జగన్ మంచి విజన్ వున్న నేత అని, తండి వైఎస్ఆర్ గారిలానే జగన్ కు కూడా ప్రజలు రానున్న ఎన్నికల్లో తప్పక పట్టం కడతారని అన్నారు.
undefined
click me!