పొత్తులపై నారా లోకేష్ ప్రకటన: పవన్ కల్యాణ్ జనసేననా?

First Published Feb 17, 2019, 3:24 PM IST

 వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తులు ఉంటాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి తనయుడు, మంత్రి నారా లోకేష్ ప్రకటించారు

వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తులు ఉంటాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి తనయుడు, మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. దీంతో తెలుగుదేశం పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోబోతుందనే చర్చ ప్రారంభమైంది
undefined
తెలంగాణలో కాంగ్రెసుతో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ ఫలితాల సాధనలో పల్టీ కొట్టింది. తెలుగుదేశం పార్టీ వల్ల కాంగ్రెసు నష్టం జరిగిందనే అంచనా విశ్లేషకులు భావించారు. ఈ అనుభవంతో కాంగ్రెసుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తు పెట్టుకోకూడదని చంద్రబాబు తేల్చేసినట్లు చెబుతున్నారు.
undefined
రాష్ట్ర విభజనకు కాంగ్రెసు కారణమనే ఆగ్రహం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఇప్పటికీ ఉండవచ్చుననే అంచనా సాగుతోంది. గత ఎన్నికల తర్వాత కూడా ఎపిలో కాంగ్రెసు బలపడిన సూచనలు కనిపించడం లేదు. కాంగ్రెసు నాయకులు ఒక్కరొక్కరే ఇతర పార్టీల పంచన చేరుతున్నారు. ఈ స్థితిలో కాంగ్రెసుతో తెలుగుదేశం పార్టీ పొత్తు ఉండే అవకాశాలు లేవని తెలుస్తోంది. రాష్ట్రంలో పొత్తులు ఉండవని ఎపి పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఇప్పటికే ప్రకటించారు.
undefined
జాతీయ స్థాయిలో కాంగ్రెసు పార్టీతో కలిసి పనిచేస్తాం గానీ రాష్ట్రంలో కాంగ్రెసుతో పొత్తు వద్దని చంద్రబాబు రాహుల్ గాంధీకి చెప్పినట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ కూడా అందుకు అంగీకరించే ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధపడాలని ఎపి కాంగ్రెసు నేతలకు చెప్పినట్లు తెలుస్తోంది.
undefined
ఇక మిగిలింది పవన్ కల్యాణ్ జనసేన. పవన్ కల్యాణ్ పై విమర్శలు చేయవద్దని చంద్రబాబు పార్టీ నేతలకు సూచించినట్లు చెబుతున్నారు. పవన్ కల్యాణ్ తో పొత్తుకు ఆయన ప్రయత్నాలు కూడా సాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
undefined
పవన్ కల్యాణ్ వామపక్షాలతో కలిసి పనిచేస్తున్నారు. ఎన్నికలకు సిపిఐ, సిపిఎంలతో కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వాస్తవానికి ఉభయ కమ్యూనిస్టులు కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగానే ఉంటారు. బిజెపితో తెలుగుదేశం పార్టీ వల్ల ఆ పార్టీలు రెండు చంద్రబాబుకు దూరమయ్యాయి.
undefined
ప్రస్తుతం బిజెపిపై చంద్రబాబు యుద్ధం ప్రకటించారు కాబట్టి వామపక్షాల నాయకులు చంద్రబాబుతో కలిసి పనిచేయడానికి వెనకాడకపోవచ్చు. ఈ కారణంగా పవన్ కల్యాణ్ చంద్రబాబుకు దగ్గరయ్యే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. పార్టీల నాయకత్వంలోని సామాజిక వర్గాల కూర్పు కూడా అందుకు అనుకూలంగా ఉందని అంటున్నారు.
undefined
click me!