భలే గిరాకీ: జనసేన టికెట్ కోసం ఆలుమగల దరఖాస్తులు

First Published Feb 18, 2019, 10:56 AM IST

జన‌సేన పార్టీ పక్షాన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అభ్య‌ర్ధిత్వం కోరుతూ వంద‌లాది మంది ఆశావ‌హులు స్క్రీనింగ్ క‌మిటీ ముందు హాజ‌రై బ‌యోడేటాల‌ను స‌మ‌ర్పిస్తున్నారు

జన‌సేన పార్టీ పక్షాన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అభ్య‌ర్ధిత్వం కోరుతూ వంద‌లాది మంది ఆశావ‌హులు స్క్రీనింగ్ క‌మిటీ ముందు హాజ‌రై బ‌యోడేటాల‌ను స‌మ‌ర్పిస్తున్నారు. ఆదివారం ఒక్క రోజే 210 మంది ఆశావ‌హులు స్క్రీనింగ్ క‌మిటీ ముందు హాజర‌య్యారు.
undefined
లోక్ సభ, శాసన సభ స్థానాలకు తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలంటూ ఆలుమగలు బయో డేటాలు ఇవ్వడం విశేషం. తమ జంటలో ఒకరికి జనసేన టికెట్ కేటాయించాలంటూ కమిటీ ముందుకు వచ్చారు.
undefined
ఆ విధంగా ఆదివారంనాడు 8 జంటలు బయో డేటాలు సమర్పించాయి. విజయవాడలోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో స్క్రీనింగ్ కమిటీ బయో డేటాలు స్వీకరించి పరిశీలించింది
undefined
ఉద‌యం 10 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు స్క్రీనింగ్ కమిటీ ప్ర‌తి ఒక్క‌రి నుంచి ద‌ర‌ఖాస్తుని స్వీక‌రించి సునిశితంగా పరిశీలించింది. వివిధ రంగాలకు చెందినవారు, వృత్తి నిపుణులు, ఉన్నత చదువులను అభ్యసించిన యువతీయువకులు వచ్చారు.
undefined
కుటుంబాన్ని చక్కదిద్దే సమర్థత, నైపుణ్యం ఉన్న ఆడపడుచులు చట్ట సభల్లో ఉండాలని ప్రభావశీలంగా చెప్పడమే కాదు.. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్ కు కట్టుబడి ఉన్నామని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రతి సభలో చెబుతున్నారు.
undefined
జనసేనాని మాటలతో మహిళలు పెద్దయెత్తున ముందుకు వస్తున్నారు. ప్రతి రోజు స్క్రీనింగ్ కమిటీ ముందుకు వచ్చే ఆశావహుల్లో మహిళల సంఖ్య గణనీయంగా ఉంటోంది.
undefined
ఆదివారం వచ్చిన 210 మందిలో 45 మంది మహిళలు ఉన్నారు. వీరిలో గృహిణులు ఉన్నారు. తమ బిడ్డలతో కలిసి బయో డేటా ఇచ్చేందుకు జనసేన కార్యాలయానికి ఉదయమే చేరుకున్నారు
undefined
click me!