చంద్రబాబు అరెస్టుపై నిర్మాత సురేష్ బాబు స్పందన.. ‘చంద్రబాబు చాలానే చేశారు’

Published : Sep 19, 2023, 02:47 PM IST
చంద్రబాబు అరెస్టుపై నిర్మాత సురేష్ బాబు స్పందన.. ‘చంద్రబాబు చాలానే చేశారు’

సారాంశం

చంద్రబాబు అరెస్టుపై నిర్మాత సురేష్ బాబు స్పందించారు. చంద్రబాబు చిత్ర పరిశ్రమకు చాలా హెల్ప్ చేశారని, కానీ, ఆయన అరెస్టుపై సినీ పరిశ్రమ స్పందించడం లేదనే ఆరోపణలు సరికావని ఆయన అన్నారు. చిత్ర పరిశ్రమ ఇలాంటి సున్నిత సమస్యలపై రాజకీయ ప్రకటనలు చేయదని వివరించారు.  

హైదరాబాద్: ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు చంద్రబాబు అరెస్టుపై స్పందించారు. చిత్ర పరిశ్రమకు చంద్రబాబు ఎంతో చేశారని, కానీ, ఆయన అరెస్టు అయినప్పుడు చిత్ర పరిశ్రమ స్పందించలేదనే వ్యాఖ్యలను ఆయన కొట్టిపారేశారు. చంద్రబాబు నాయుడి అరెస్టు చాలా సున్నితమైన విషయమని వివరించారు. చిత్ర పరిశ్రమ రాజకీయ, మతపరమైన అంశాలపై ఎలాంటి ప్రకటనలు చేయదని స్పష్టం చేశారు. అందుకే చంద్రబాబు అరెస్టుపై కూడా ఎటువంటి ప్రకటన ఇవ్వలేదని వివరించారు.

చిత్ర పరిశ్రమ ఇలాంటి వాటికి దూరంగా ఉండాలనే తాను అనుకుంటానని సురేష్ బాబు అన్నారు. రాజకీయంగా ప్రకటనలు ఇవ్వడం మంచిది కాదని తెలిపారు. తాము రాజకీయ నాయకులం కాదని, లేదా మీడియా వాళ్లం కాదని చెప్పారు. తాము సినిమాలు నిర్మిస్తామని అన్నారు. కాబట్టి, చిత్రపరిశ్రమ రాజకీయ ప్రకటనలు ఇవ్వడం మంచిది కాదనే అనుకుంటానని వివరించారు.

ముఖ్యమంత్రులు చాలా మంది చిత్ర పరిశ్రమ అభివృద్ధికి దోహదపడ్డారని సురేష్ బాబు అన్నారు. చెన్నారెడ్డి గారు చాలా హెల్ప్ చేశారని, ఆ తర్వత ఎన్టీఆర్ చేశారని వివరించారు. చంద్రబాబు కూడా చిత్ర పరిశ్రమకు చాలానే చేశారని తెలిపారు. అలాగని, చిత్ర పరిశ్రమ స్పందించడం లేదని కామెంట్ చేయడం సరికాదని వివరించారు. చంద్రబాబు అరెస్టు చాలా సున్నితమైన ఇష్యూ అని, ఆంధ్రా, తెలంగాణ గొడవలప్పుడు కూడా చిత్ర పరిశ్రమ స్పందించలేదని గుర్తు చేశారు.

Also Read : అసత్యాలు చెప్పడం చంద్రబాబుకు పుట్టుకతోనే వచ్చింది.. ఆ ఘటనకు ప్రత్యక్ష సాక్షిని: మోహన్‌బాబు

ఎవరైనా వ్యక్తిగతంగా స్పందిస్తే అభ్యంతరమేమీ ఉండదని సురేష్ బాబు చెప్పారు. తమ తండ్రి రామానాయుడు టీడీపీ సభ్యుడని, తాను కూడా పార్టీ కోసం పని చేశానని వివరించారు. అది తమ వ్యక్తిగతం అని తెలిపారు. కానీ, ఇక చిత్ర పరిశ్రమ విషయానికి వస్తే.. తాను ఫిలిం చాంబర్ ప్రెసిడెంట్ అని వివరించారు. తామంతా చిత్ర పరిశ్రమకు చెందిన వారిమని, అందుకే చంద్రబాబు అరెస్టు గురించి స్పందించలేదని తెలిపారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

AP Food Commission Serious: ఈ హాస్టల్ కంటే జైల్ బెటర్.. పిల్లలు ఏడుపే తక్కువ | Asianet News Telugu
బిలాయి నుండివచ్చాం.. ఆంధ్రాకల్చర్ ని ఎంజాయ్ చేశాం:Visakhaలో Bhogi Celebrations | Asianet News Telugu