నేడు కొండపల్లికి టిడిపి నిజనిర్ధారణ కమిటీ.. నిన్నటి నుంచే టిడిపి నేతల గృహ నిర్భంధం.. పోలీసుల మోహరింపు..

By AN TeluguFirst Published Jul 31, 2021, 10:59 AM IST
Highlights

ఈ నేపథ్యంలో కొండపల్లి, ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో పోలీసుల మోహరించారు. నిన్నటి నుంచి కమిటీ సభ్యులను పోలీసులు  గృహనిర్బంధం చేశారు. కొండపల్లి ప్రాంతంలో అక్రమ మైనింగ్ మీద చంద్రబాబు 10 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. కాగా మొత్తం 10 మంది సభ్యుల కమిటీలో 8 మందిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. 

ఈ రోజు కొండపల్లి ప్రాంతంలో తెదేపా నిజనిర్ధరణ కమిటీ పర్యటనకు సిద్ధమయింది. కొండపల్లి ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరుగుతోందనే ఫిర్యాదులపై క్షేత్రస్థాయి పర్యటనకు కమిటీ నిశ్చయించుకుంది. 

ఈ నేపథ్యంలో కొండపల్లి, ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో పోలీసుల మోహరించారు. నిన్నటి నుంచి కమిటీ సభ్యులను పోలీసులు  గృహనిర్బంధం చేశారు. కొండపల్లి ప్రాంతంలో అక్రమ మైనింగ్ మీద చంద్రబాబు 10 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. కాగా మొత్తం 10 మంది సభ్యుల కమిటీలో 8 మందిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. 

గుంటూరులో నక్కా ఆనందబాబు గృహనిర్బంధం, విజయవాడలో వర్ల రామయ్య, బొండా ఉమ గృహనిర్బంధం, మచిలీపట్నంలో కొనకళ్ల , కొల్లు రవీంద్ర గృహనిర్బంధం, జగ్గయ్యపేటలో నెట్టెం రఘురామ్ గృహనిర్బంధం, నందిగామలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గృహనిర్బంధం, విజయవాడలో నాగుల్‌మీరాలను పోలీసులు గృహనిర్బంధం చేశారు.

దీంతోపాటు తెదేపా కేంద్ర కార్యాలయం, ఎన్టీఆర్‌ భవన్‌ వద్ద కూడా పోలీసుల మోహరించారు, అయితే ఏదేమైనా కొండపల్లిలో క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతామని తెదేపా నేతలు అంటున్నారు. 

కాగా, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కొండపల్లి వెళ్లేందుకు ఆనంద్ బాబు ఇంటి నుంచి బయటకు వచ్చారు.  ఇంటి గేటు వద్దే పోలీసులు ఆనంద్ బాబును అడ్డుకున్నారు. దీంతో టీడీపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట నెలకొంది.

మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత.! (వీడియో)

పోలీసుల తీరుకు వ్యతిరేకంగా టిడిపి నేతలు నినాదాలు చేశారు. దీంతో పోలీసులు - టిడిపి నేతల మద్య తీవ్ర వాగ్వివాదం ఏర్పడింది. మాజీ మంత్రివర్యులు నక్కా ఆనంద్ బాబు  హౌస్అరెస్ట్ లో వున్నారు. కృష్ణాజిల్లా, కొండపల్లిలో అక్రమ మైనింగ్ పరిశీలనకు బయలుదేరకుండా నక్కా ఆనంద్ బాబు ఇంటిని పోలీసులు చుట్టూ ముట్టారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నిజ నిర్థారణ కమిటీ ఈరోజు కొండపల్లిలో అక్రమ మైనింగ్ జరుగుతున్న ప్రాంతంలో పర్యటనకు సిద్ధమయ్యింది. ఆనంద్ బాబు ఇంటివద్దకు  టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీగా చేరుకుంటున్నారు.

ఈ నిజ నిర్థారణ కమిటీలో ఒకరైన మాజీమంత్రి ఆనంద్ బాబుకు ముందస్తుగా ఎటువంటి నోటీస్ లు ఇవ్వకుండా హౌస్ అరెస్ట్ చెయ్యడం దారుణం అని వారు పేర్కొన్నారు. నిన్నటి నుంచే ఆనంద్ బాబు ఇంటినుండి బయటకు రాకుండా పోలీసులు. నిలువరిస్తున్నారు. 

click me!