మహిళల చేతులు పట్టుకుని మరీ పాల క్యాన్ లు తనిఖీ చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తే.. క్యాన్ లలో మద్యం తెస్తున్నారని తనిఖీలు చేశామంటూ సిబ్బంది చెప్పుకొచ్చారు. దీంతో మహిళల పట్ల అసభ్య ప్రవర్తన పై గ్రామస్తుల ఆగ్రహం వ్యక్తం చేశారు.
గుంటూరు : క్రోసూరు మండలం అనంతరం లో ఎక్సైజ్ పోలీసులు అత్యుత్సాహం చూపించారు. గ్రామంలో పాలు పోసి వస్తున్న మహిళాల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు.
మహిళల చేతులు పట్టుకుని మరీ పాల క్యాన్ లు తనిఖీ చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తే.. క్యాన్ లలో మద్యం తెస్తున్నారని తనిఖీలు చేశామంటూ సిబ్బంది చెప్పుకొచ్చారు. దీంతో మహిళల పట్ల అసభ్య ప్రవర్తన పై గ్రామస్తుల ఆగ్రహం వ్యక్తం చేశారు.
గ్రామస్తులు ఎక్సైజ్ సిబ్బంది ని నిర్బందించి, ఆందోళన చేపట్టారు. క్రోసూరు మండలం అనంతవరంలో యస్ఈబీ సిఐ సహ సిబ్బందిని గ్రామస్థులు నిర్బంధించారు. తనిఖీల పేరుతో మహిళలపట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు.