మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత.! (వీడియో)

By AN Telugu  |  First Published Jul 31, 2021, 10:43 AM IST

పోలీసుల తీరుకు వ్యతిరేకంగా టిడిపి నేతలు నినాదాలు చేశారు. దీంతో పోలీసులు - టిడిపి నేతల మద్య తీవ్ర వాగ్వివాదం ఏర్పడింది. మాజీ మంత్రివర్యులు నక్కా ఆనంద్ బాబు  హౌస్అరెస్ట్ లో వున్నారు. కృష్ణాజిల్లా, కొండపల్లిలో అక్రమ మైనింగ్ పరిశీలనకు బయలుదేరకుండా నక్కా ఆనంద్ బాబు ఇంటిని పోలీసులు చుట్టూ ముట్టారు.

అమరావతి : మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కొండపల్లి వెళ్లేందుకు ఆనంద్ బాబు ఇంటి నుంచి బయటకు వచ్చారు.  ఇంటి గేటు వద్దే పోలీసులు ఆనంద్ బాబును అడ్డుకున్నారు. దీంతో టీడీపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట నెలకొంది.

"

Latest Videos

పోలీసుల తీరుకు వ్యతిరేకంగా టిడిపి నేతలు నినాదాలు చేశారు. దీంతో పోలీసులు - టిడిపి నేతల మద్య తీవ్ర వాగ్వివాదం ఏర్పడింది. మాజీ మంత్రివర్యులు నక్కా ఆనంద్ బాబు  హౌస్అరెస్ట్ లో వున్నారు. కృష్ణాజిల్లా, కొండపల్లిలో అక్రమ మైనింగ్ పరిశీలనకు బయలుదేరకుండా నక్కా ఆనంద్ బాబు ఇంటిని పోలీసులు చుట్టూ ముట్టారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నిజ నిర్థారణ కమిటీ ఈరోజు కొండపల్లిలో అక్రమ మైనింగ్ జరుగుతున్న ప్రాంతంలో పర్యటనకు సిద్ధమయ్యింది. ఆనంద్ బాబు ఇంటివద్దకు  టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీగా చేరుకుంటున్నారు.

ఈ నిజ నిర్థారణ కమిటీలో ఒకరైన మాజీమంత్రి ఆనంద్ బాబుకు ముందస్తుగా ఎటువంటి నోటీస్ లు ఇవ్వకుండా హౌస్ అరెస్ట్ చెయ్యడం దారుణం అని వారు పేర్కొన్నారు. నిన్నటి నుంచే ఆనంద్ బాబు ఇంటినుండి బయటకు రాకుండా పోలీసులు. నిలువరిస్తున్నారు. 

click me!