Pawan Kalyan : ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలపై పవన్ ఫోకస్... నేడు జనసేన కీలక సమావేశం

Published : Dec 01, 2023, 10:55 AM ISTUpdated : Dec 01, 2023, 11:10 AM IST
Pawan Kalyan : ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలపై పవన్ ఫోకస్... నేడు జనసేన కీలక సమావేశం

సారాంశం

జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం నేడు మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరగనుంది. పవన్ కల్యాణ్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో కీలక అంశాలను చర్చించనున్నాారు.  

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమయ్యింది. మరో రెండుమూడు నెలల్లోనే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. దీంతో అప్పట్లోపు జనసేన శ్రేణులను సంసిద్దం చేసేందుకు ఆ పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ సిద్దమయ్యారు.   ఇందులో భాగంగానే నేడు జనసేన పార్టీ విస్తృతసమావేశం ఏర్పాటుచేసారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో జనసేన పీఏసి, కార్యవర్గ సభ్యులు, అన్నిజిల్లాలు, నగరాల అధ్యక్షులు, నియోజకవర్గ ఇంచార్జీలు, అనుంబంధ విభాగాల ఛైర్మన్లు పాల్గొననున్నారు. 

ఇప్పటికే తెలుగుదేశం పార్టీతో కలిసే రాబోయే స్వార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఈ క్రమంలో రెండు పార్టీలు కలిసి వైసిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి సిద్దమయ్యాయి. ఎన్నికలకు ముందు జగన్ సర్కార్ వైఫల్యాలను ప్రజలముందు పెట్టేలా ఉమ్మడి కార్యక్రమాలకు ఇరుపార్టీలు సిద్దమవుతున్నాయి. వీటిని సమన్వయంతో క్షేత్రస్థాయిలో నిర్వహించాలని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన అంశాలపై జనసేన విస్తృతస్థాయి సమావేశంలో పవన్ చర్చించనున్నారు. 

ఇక ఓటర్ లిస్ట్ లో అవకతవకలు జరిగినట్లు... భారీగా ఓట్ల తొలగింపు, చేర్పులు జరిగాయని టిడిపి, జనసేన పార్టీలు ఆరోపిస్తున్నారు. దీనిపై ఇప్పటికే టిడిపి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీనిపై జనసేన పార్టీ కూడా పోరాటానికి సిద్దమవుతోంది. దీనిపైన ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై పార్టీ శ్రేణులకు జనసేనాని దిశానిర్దేశం చేయనున్నారు. 

Read More  Nara Chandrababu Naidu:తిరుమల వెంకన్నను దర్శించుకున్న చంద్రబాబు

ఇదిలావుంటే డిసెంబర్ 4 నుండి పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఇవాళ టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది. చంద్రబాబు అద్యక్షతన టిడిపి కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై టిడిపి నాయకులు చర్చించుకోనున్నారు.  వైసిపి ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులపై చేస్తున్న దౌర్జన్యం, ప్రజా వ్యతిరేక పాలనపై పార్లమెంట్ ముందుంచాలని టిడిపి భావిస్తోంది... దీనిపై టిడిపి ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. 

స్కిల్ డెవలప్ కేసులో అరెస్టయిన టిడిపి చీఫ చంద్రబాబు నాయుడు జైలు నుండి బయటకు వచ్చినా టిడిపి కార్యక్రమాల్లో పాల్గొనలేదు. కోర్టు షరతుల కారణంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా వున్న ఆయన ఇటీవలే సాధారణ బెయిల్ పొందారు. దీంతో ఇక పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ రాజకీయంగా యాక్టివ్ అయ్యేందుకు సిద్దమయ్యారు. ఇందుకోసమే చంద్రబాబు హైదరాబాద్ నుండి ఆంధ్ర ప్రదేశ్ కు చేరుకున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!