ఏపీలో ఆది, సోమవారాలు భారీ వర్షాలు... ఆ ఐదు జిల్లాల్లో హై అలర్ట్

By Arun Kumar PFirst Published Sep 12, 2021, 9:24 AM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ లో ఈ రెండురోజులు(ఆది, సోమవారం) భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ ప్రకటించింది. కొన్ని జిల్లాల్లో ఈ వర్ష తీవ్రత వుండనుందని... ఆ జిల్లాల ప్రజలు, అధికారులు అప్రమత్తంగా వుండాలని హెచ్చరించారు. 

విశాఖపట్నం: తూర్పు మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలో శనివారం అల్పపీడనం ఏర్పడిందని... ఇది వాయువ్యం దిశగా రేపటికి(సోమవారం) వాయుగుండంగా మారే అవకాశం వుందని వాతావరణ శాఖ ప్రకటించింది. వీటి ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లో ఇవాళ, రేపు (ఆది,సోమవారం) భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని హెచ్చరించారు.

ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని తెలిపారు. ఈ  మిగతా జిల్లాలో చెదురుమదురు జల్లులతో పాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. 

వాయుగుండం ప్రభావంతో తీరం వెంబడి గంటకు 55నుండి 65కిలోమీటల్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. సముద్రం అల్లకల్లోలంగా వుండే అవకాశం వుంది కాబట్టి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. 

READ MORE  Delhi-NCR : ఢిల్లీలో నేడు భారీ వర్షాలు.. ఆరంజ్ అలర్ట్ జారీ..

ఇక గడిచిన కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో గోదావరి నదికి నీరు పోటెత్తుతోంది. భారీగా వరద నీరు చేరడంతో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం గోదావరి నీరు అవుట్ ఫ్లో 10,01,445 క్యూసెక్కులుగా ఉంది. దీంతో విపత్తుల శాఖ కమిషనర్ కె . కన్నబాబు ఎప్పటికప్పుడు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అంతేకాదు.. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముందస్తుగా హెచ్చరికలు జారీ చేశారు.

 మరోవైపు బ్యారేజీ నుండి 9,11,838 క్యూసెక్కులు మిగులు జలాలను అధికారులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. గోదావరి డెల్లా కాలువలకు 10,200 క్యూసెక్కులు సాగునీరు విడుదల చేశారు అధికారులు. ఎగువ ప్రాంతాల్లోని భద్రాచలం వద్ద గోదావరి వరద తగ్గుతోంది. ఇక రాజమండ్రి వద్ద గోదావరి వరద ఉద్ధృతి మరికొంత పెరిగి తరువాత తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
 

click me!