ఒక్కసారిగా పెరిగిన మరణాలు.. కొత్తగా 1,145 మందికి పాజిటివ్, ఏపీలో 20,24,755కి చేరిన కేసులు

Siva Kodati |  
Published : Sep 11, 2021, 06:03 PM ISTUpdated : Sep 11, 2021, 06:05 PM IST
ఒక్కసారిగా పెరిగిన మరణాలు.. కొత్తగా 1,145 మందికి పాజిటివ్, ఏపీలో 20,24,755కి చేరిన కేసులు

సారాంశం

ఏపీలో కొత్తగా 1,145 కరోనా కేసులు నమోదవ్వగా.. 17 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 1,090 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 15,157 మంది చికిత్స పొందుతున్నారు

ఆంధ్రప్రదేశ్‌‌‌లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,145 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 20,24,755కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 17 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 13,987కి చేరుకుంది.

గడిచిన 24 గంటల్లో కోవిడ్ వల్ల చిత్తూరు 4, కడప 3, నెల్లూరు 3, కృష్ణ 2, ప్రకాశం 2, తూర్పుగోదావరి, గుంటూరు, శ్రీకాకుళంలలో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 1,090 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 19,96,756కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 49,581 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,72,79,362కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 15,157 మంది చికిత్స పొందుతున్నారు. 

నిన్న ఒక్కరోజు అనంతపురం 18, చిత్తూరు 132, తూర్పుగోదావరి 216, గుంటూరు 85, కడప 111, కృష్ణ 128, కర్నూలు 6, నెల్లూరు 173, ప్రకాశం 117, శ్రీకాకుళం 12, విశాఖపట్నం 62, విజయనగరం 7, పశ్చిమ గోదావరిలలో 78 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.

 

PREV
click me!

Recommended Stories

YS Jagan Review Meeting with YSRCP Regional Coordinators | వై ఎస్ జగన్ కీలక సమావేశం | Asianet Telugu
గన్నవరం ప్రజలకు బిగ్ రిలీఫ్ స్పాట్ లోనే పట్టాలు | Chandrababu Key Decision on 22A Lands