చెయ్యాలా?  వద్దా?

Published : Feb 24, 2017, 03:38 AM ISTUpdated : Mar 24, 2018, 12:14 PM IST
చెయ్యాలా?  వద్దా?

సారాంశం

మంత్రులుగా తమను తప్పిస్తే ఒప్పుకోమని కొందరు, పలానా వారికి ఇస్తే అంగీకరించేది లేదని మరి కొందరు చెబుతుండటం కొత్తగా ఉంది.

మంత్రివర్గం ప్రక్షాళన చంద్రబాబునాయుడుకు పెద్ద తలనొప్పులనే తెచ్చేట్లున్నాయి. ఆశావహులు పెరిగిపోతుండటం, మంత్రుల్లో కొందరిని తప్పిస్తారన్న ప్రచారంతో పార్టీ, ప్రభుత్వంలో టెన్షన్ పెరిగిపోతోంది. మంత్రులుగా తీసుకోవాలన్నా, పక్కకు తప్పించాలన్నా చంద్రబాబు కుల, ప్రాంతీయ సమీకరణలను చూస్తారు. అయితే వీటికి అదనంగా ఫిరాయింపులనే కొత్త సమీకరణ కూడా చేరింది. మొదటి రెండింటికన్నా మూడోదే పెద్ద సమస్యగా మారేట్లుంది చంద్రబాబుకు. ఉగాది పం డుగ కాగానే మార్చి నెల 19వ తేదీన మంత్రివర్గ ప్రక్షాళన ఉంటుందని ప్రచారం జరుగుతోంది.

 

వైసీపీని దెబ్బ కొట్టే ఉద్దేశ్యంతో 21 మంది ఎంల్ఏలను టిడిపిలోకి లాక్కున్నారు. అందులో కొందరికి మంత్రిపదవులను ఎరేసారు. అదే ఇపుడు పెద్ద సమస్యగా మారింది. ప్రభుత్వం ఏర్పడినప్పటి మంత్రివర్గాన్నే చంద్రబాబు ఇంకా కొనసాగిస్తున్నారు. అయితే, వారిలో పలువురిపై అసమర్ధులను, అవితీని పరులనే ముద్రలు పడ్డాయి. వారిని తప్పించాలని అనుకున్నా వారి సామాజికవర్గాలే ఇంత వరకూ కాపాడుతున్నాయి. విచిత్రమేమిటంటే, మంత్రులుగా తమను తప్పిస్తే ఒప్పుకోమని కొందరు, పలానా వారికి ఇస్తే అంగీకరించేది లేదని మరి కొందరు చెబుతుండటం కొత్తగా ఉంది.

 

ఈ పరిస్ధితుల్లో తన కుమారుడు లోకేష్ ను మంత్రివర్గంలోకి చేర్చుకోనున్నట్లు స్వయంగా చంద్రబాబే చెప్పారు. దాంతో మంత్రివర్గ ప్రక్షాళన తధ్యమన్నది తేలిపోయింది. అయితే, ముహూర్తమే తేలటం లేదు. ఈ నేపధ్యంలోనే తమకు మంత్రిపదవులు ఇవ్వాలని ఫిరాయింపు ఎంఎల్ఏలు చంద్రబాబుపై ఒత్తిడి పెడుతున్నారు. ఇందులో భూమా నాగిరెడ్డి, జ్యోతుల నెహ్రూ, జలీల్ ఖాన్, సుజయ్ కృష్ణ రంగారావులున్నారు. వైసీపీలో ఉన్నపుడు వీరికి జగన్ తో మంచి సంబంధాలే ఉన్నాయి. అయితే, మంత్రిపదవులు ఎరేసి వీరందరినీ చంద్రబాబు లాక్కున్నారు. అయితే, ఫిరాయింపు ఎంఎల్ఏలకు మంత్రిపదవులు ఇచ్చే ఉద్దేశ్యంలో చంద్రబాబు లేరని పార్టీలో తాజాగా ప్రచారం ఊపందుకుంది.

 

ప్రచారం ఎక్కువయ్యేకొద్దీ ఫిరాయింపు ఎంఎల్ఏల్లో ఆందోళన పెరిగిపోతోంది. ఆందోళనతోనే వారు చంద్రబాబుకే అల్టిమేటమ్ ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తమకు మంత్రిపదవులు ఇవ్వకపోతే తమ దారి తాము చూసుకుంటామని చంద్రబాబుకు కబురు పంపుతున్నారట. వీరి వ్యవహారం ఇలాగుంటే, పార్టీలోని బోండా ఉమ లాంటి కాపు ఎంఎల్ఏలు కూడా తమకు మంత్రిపదవులు కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతలో తమను గనుక మంత్రివర్గం నుండి తప్పిస్తే తాము కూడా తమ దారి తాము చూసుకుంటామని కొందరు మంత్రులు సిఎంకు ఫీలర్లు పంపుతున్నారట. దాంతో అన్నీ వైపుల నుండి ఒత్తిళ్లు పెరిగిపోతుండటంతో ఏం చేయాలో చంద్రబాబుకు అర్ధం కావటం లేదు.

 

PREV
click me!

Recommended Stories

ఎర్నాకులం ఎక్స్ ప్రెస్ రైలులో అగ్ని ప్రమాదం: Ernakulam Express Train Fire | Asianet News Telugu
Train Fire : విశాఖపట్నంలో ఘోర ప్రమాదం.. రైలులో చెలరేగిన మంటలు