తూ.గో జిల్లాలో భారీగా పట్టుబడ్డ గంజాయి... కొబ్బరికాయల లోడ్ మాటున హైదరాబాద్ కు స్మగ్లింగ్

By Arun Kumar PFirst Published Oct 28, 2021, 11:40 AM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ లో గంజాయి, డ్రగ్స్ స్మగ్లింగ్ తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్న తరుణంలో తూర్పు గోదావరి జిల్లాలో భారీగా గంజాయి పట్టబడటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 

చింతూరు: వైసిపి పాలనలో ఆంధ్ర ప్రదేశ్ డ్రగ్స్, గంజాయి స్మగ్లింగ్ కు అడ్డాగా మారిందని ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్న సమయంలోనే భారీస్థాయిలో గంజాయి పట్టుబడింది. తూర్పు గోదావరి జిల్లాలో దాదాపు రెండు కోట్ల విలువైన 2000వేల కిలోల గంజాయి పోలీసుల తనిఖీల్లో పట్టుబడింది. ఏపీ నుండే గంజాయి దేశం మొత్తానికి సరఫరా అవుతుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న సమయంలో భారీస్థాయిలో గంజాయి పట్టుబడటం సంచలనంగా మారింది. 

వివరాల్లోకి వెళితే... east godavari జిల్లాలోని చింతూరు పరిధిలోని మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాల తనిఖీ చేపట్టగా ఓ డిసిఎం వ్యాన్ అనుమానాస్పదంగా కనిపించిందని ఏఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు. విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దుల నుంచి హైదరాబాద్ కు కొబ్బరికాయ లోడ్ తో వెళుతున్న ఆ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించగా కొబ్బరికాయల కింద గంజాయిని గుర్తించారు. ఈ గంజాయి మూఠలను స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ తెలిపారు. 

పట్టుబడిన గంజాయి 2000కిలోల వరకు వుంటుందని... దీని విలువ రూ.2కోట్లు వుంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. గంజాయిని తరలిస్తున్న డిసిఎం వాహనంతో పాటు ఓ కారు, మూడు చరవాణులు, రూ.2వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ తెలిపారు. డిసిఎం డ్రైవర్ తో పాటు ముగ్గురు స్మగర్లను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. 

read more చంద్రబాబు డ్రగ్స్ తీసుకొంటున్నారేమో?: వైసీపీ ఎమ్మెల్యే కోరుముట్ల

అరెస్టయిన వారిలో తెలంగాణలోని ఖమ్మం జిల్లా లింగాపురం మండలం కొత్తపల్లికి చెందిన న్యాయవాది కడియం గురుసాగర్, నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలానికి చెందిన పొగిడాల పర్వతాలు, ఒడిశాలోని మల్కాన్ గిరి జిల్లా చిత్రకొండ మండలం కూర్మనూర్ కు చెందిన నైని రామారావులు వున్నట్లు ఏఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు. వీరిని ఇప్పటికే రిమాండ్ కు తరలించినట్లు... విచారణ తర్వాత ఈ గంజాయి స్మగ్లింగ్ కు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏఎస్పీ తెలిపారు.

ఇటీవల కాలంలో దేశంలో ఎక్కడ  drugs, ganja పట్టుబడినా ఏదో విధంగా ఆంధ్ర ప్రదేశ్ తో లింక్ కలిగివుంటోంది. గుజరాత్ లోని ముంద్రా పోర్ట్ లో పట్టుబడిన వేల కోట్ల విలువచేసే 2,988 కిలోల హెరాయిన్‌ను కూడా విజయవాడలోని ఆషీ ట్రేడింగ్‌ కంపెనీ చిరునామాతో దిగుమతి అయ్యింది. దీంతో అధికార వైసిపి సహాయంతోనే ఈ డ్రగ్స్ దందా సాగుతున్నట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ విషయంలోనే ఇటీవల ప్రతిపక్ష టిడిపి, అధికార వైసిపి శ్రేణుల మధ్య మాటలయుద్దం పెరగి బౌతిక దాడులకు దారితీసింది. 

 ఏపీ నార్కోటిక్స్ హబ్‌గా మారింది & ప్రతి స్థాయిలో చాలా మంది డ్రగ్స్ లార్డ్‌లతో నిండిపోయిందని... ఇది దేశం మొత్తం ప్రభావం చూపుతోందన్నారు. ప్రభుత్వ ఇన్‌ఛార్జ్‌లుగా ఉన్న నాయకులు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారని అని పవన్ ఆరోపించారు. అంతేకాకుండా నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ చెప్పిన మాటలు చూడండి అంటూ ఓ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు. ఆ వీడియోలో ఎస్పీ రంగనాథ్ మాట్లాడూతూ.. గంజాయి AOB ప్రాంతం నుంచి దేశంలోని చాలా ప్రాంతాలకు తరలిస్తున్నట్లు చెప్పారు. అది వేల కోట్ల బిజినెస్ అని తెలిపారు.

read more  రెండు రోజులుగా అదృశ్యం: మాల్దీవుల్లో టీడీపీ నేత పట్టాభి?

మరో ట్వీట్‌లో పవన్ కల్యాణ్ హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ వీడియోను షేర్ చేశారు. ‘హైదరాబాద్ సిటీ పోలీస్ కమీషనర్ శ్రీ అంజనీ కుమార్.. ఏపీ నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు మాదక ద్రవ్యాలు ఎలా రవాణా చేయబడుతున్నాయో వివరాలను తెలియజేస్తున్నారు’అని పేర్కొన్నారు. 

2018లో రాష్ట్ర ప్రజల సామాజిక, ఆర్థిక సమస్యలను అర్థం చేసుకోవడానికి పోరాట యాత్రను చెప్పటినట్టు పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. ఆ సమయంలో ఆంధ్రా ఒరిస్సా సరిహద్దులోని గిరిజన ప్రాంతాల్లో నిరుద్యోగం, అక్రమ మైనింగ్, గంజాయి వ్యాపారం, గంజాయి మాఫియా గురించి తనకు అనేక ఫిర్యాదు వచ్చాయని జనసేనాని తెలిపారు. 
 

click me!