అసెంబ్లీ ముట్టడికి టిఎన్ఎస్ఎఫ్ నాయకుల యత్నం... పోలీసులతో తోపులాట, ఉద్రిక్తత (వీడియో)

By Arun Kumar PFirst Published Nov 18, 2021, 12:06 PM IST
Highlights

ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ అసెంబ్లీ ముట్టడికి తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ యత్నించింది. టిఎన్ఎస్ఎఫ్ నాయకుల ఆందోళనతో అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. 

అమరావతి: గురువారం ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశం నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం ఆందోళన చేపట్టింది. అసెంబ్లీ ముట్టడికి తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ (TNSF)శ్రేణులు ప్రయత్నించాయి. టిడిపి జెండాలతో అసెంబ్లీ ప్రధాన మార్గంలోని గేట్ వద్దకు చేరుకున్న టీఎన్ఎస్ఎఫ్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారిని తోసుకుంటూ లోపలికి వెళ్లేందుకు విద్యార్థి నాయకులు ప్రయత్నించడంతో తోపులాట జరిగి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

ప్రభుత్వానికి వ్యతిరేకంగా telugunadu student federation నాయకులు నినాదాలు చేసారు. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటుంటే నిరసన తెలిపే హక్కు విద్యార్థులకు లేదా అని మండిపడ్డారు. aided విద్యా వ్యవస్థను నాశనం చేసే ప్రభుత్వ జీవోలు 42 ,50, 51 లను తక్షణమే రద్దు చేయాలని టిఎన్ఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. 

వీడియో

అసెంబ్లీ ముట్టడికి యత్నించిన టీఎన్ఎస్ఎఫ్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. దీంతో AP Assembly వద్ద ఉద్రిక్తత సద్దుమణిగింది. ఈ ఘటన నేపథ్యంలో అసెంబ్లీ వద్ద పోలీస్ బందోబస్తును మరింత పెంచారు.  

READ MORE  AP Assembly: ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ.. టీడీపీ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన స్పీకర్

ఇక ysrcp ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ర్యాలీగా అసెంబ్లీకి చేరుకున్నారు టిడిపి ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు. వెంకటపాలెంలోని దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన టిడిపి చీఫ్ చంద్రబాబు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భారీ ర్యాలీగా అసెంబ్లీకి బయలుదేరారు. ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ, ప్రజాకంటక ప్రభుత్వం నశించాలి అని రాసివున్న బ్యానర్ ను ప్రదర్శిస్తూ అసెంబ్లీ వరకు TDP నాయకుల ర్యాలీ సాగింది.

ఇక రాష్ట్రంలో పెట్రోల్, డిజీల్, నిత్యావసరాల ధరల పెంపుపై టిడిపి వాయిదా తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, ఇతర సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని సభాపతి తమ్మినేని సీతారాం తిరస్కరించారు. 

ఇదిలావుంటే కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే అసెంబ్లీ సమావేశం జరిగే అవకాశాలున్నాయని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా నవంబర్ 26 వరకు సమావేశాలను కొనసాగించాలని నిర్ణయించింది. ఈ మేరకు బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకన్నారు. 

READ MORE  AP Assembly: ఈ నెల 26 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. బీఏసీలో నిర్ణయం..

బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో సీఎం వైఎస్ జగన్, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, అనిల్ కుమార్ యాదవ్, కన్నబాబుతో పాటు ప్రతిపక్ష టీడీపీ తరపున ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు హజరయ్యారు. అసెంబ్లీ సమావేశం ఒక్క రోజు కాకుండా పొడగించాలని టీడీపీ కోరిన వెంటనే ప్రభుత్వం నవంబర్ 26 వరకు సమావేశాలు నిర్వహించడానికి బీఏసీలో నిర్ణయం తీసుకుంది.

అసెంబ్లీ సమావేశాల పొడగింపుకు సంబంధించి ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ... సభను ఎన్ని రోజులైన కొనసాగించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. టెక్నికల్‌గా ఈరోజు ఒక్కరోజు సభను కొనసాగించాలి కాబట్టి నేడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయని అన్నారు. అయితే ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తర్వాత జరుపుదామని అనుకున్నప్పటికీ.. టీడీపీ వాళ్లు సభ జరపాలని అడిగారు. ఈ క్రమంలోనే సభను 26వ తేదీ వరకు కొనసాగించాలని బీఏసీలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఏ అంశంపైన చర్చించడానికైనా ప్రబుత్వం సిద్దంగా ఉందని వెల్లడించారు.  


 

click me!