YS Viveka Murder Case: కీలక పరిణామం... వైసిపి రాష్ట్ర కార్యదర్శి శివశంకర్ రెడ్డి అరెస్ట్?

By Arun Kumar PFirst Published Nov 18, 2021, 9:52 AM IST
Highlights

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసు మరో మలుపు తిరిగింది. సిబిఐ అధికారులు వైసిపి రాష్ట్ర కార్యదర్శి, ఎంపి అవినాష్ రెడ్డి అనుచరుడు శివశంకర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. 

కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ విచారిస్తోంది. ఈ క్రమంలోనే ఈ హత్యతో వైఎస్ కుటుంబసభ్యులతో పాటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధాలున్నట్లు ఇటీవల వివేకా డ్రైవర్ దస్తగిరి వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే దస్తగిరి బయటపెట్టిన వారి అరెస్టులు మొదలయ్యాయి. 

YS Vivekananda Reddy హత్యతో సంబంధాలున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ysrcp mp avinash reddy సన్నిహితుడు, వైసిపి రాష్ట్ర  కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని సిబిఐ అధికారులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. బుధవారం హైదరాబాద్ లో devireddy shivashankar reddy ని సిబిఐ అధికారులు అదులోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ అరెస్ట్ పై CBI గానీ, ఇటు పోలీసు శాఖ నుండి గానీ ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న శివశంకర్ రెడ్డి వైద్యం కోసం హైదరాబాద్ కు వచ్చినట్లు సిబిఐ అధికారులు తెలుసుకుని ఇక్కడే అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శివశంకర్‌రెడ్డి అరెస్టును దృవీకరించ లేదు. దీంతో ఈ అరెస్ట్ పై సస్పెన్స్ కొనసాగుతోంది.  

read more  YS Viveka Case: వివేకా హత్య కేసులో సీఎం జగన్‌నూ సీబీఐ విచారించాలి: టీడీపీ నేత పట్టాభి
 
కడప జిల్లా లింగాల మండలం దొడ్లవాగు గ్రామానికి చెందిన శివశంకర్ రెడ్డి వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. ప్రస్తుత కడప ఎంపీ అవినాశ్ రెడ్డి ముఖ్య అనుచరుడు. గతంలో వైఎస్సార్ హయాంలో కడప జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా పనిచేసిన ఆయన ఆ తర్వాత జగన్ స్థాపించిన వైసిపి పార్టీలో చేరాడు. ప్రస్తుతం ఆ పార్టీ రాష్ట్రస్థాయి నాయకుడిగా కొనసాగుతున్నాడు. సీఎం జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో ముఖ్యమైన వైసీపీ నాయకుల్లో శివశంకర్‌రెడ్డి ఒకరు. 

వివేకా హత్యకు సంబంధించిన సంచలన విషయాలను ఆయన డ్రైవర్ దస్తగిరి సిబిఐ అధికారులకు తెలిపెతూ ఓ వాంగ్మూలం ఇచ్చాడు. ఇందులో చాలామంది పెద్దతలకాయల పేర్లున్నాయి. వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేస్తే ఎర్రా గంగిరెడ్డి రూ. 40 కోట్లు ఇస్తాడని శంకర్ రెడ్డి తనకు చెప్పినట్టు దస్తగిరి పేర్కొన్నాడు. అంతేకాదు హత్య జరిగిన తర్వాత తనతో సహా కొంతమందిమి శంకర్ రెడ్డి ఇంటికి వెళ్లినట్లు... అప్పుడు కూడా తమకేమీ సమస్య రాకుండా ఎర్ర గంగిరెడ్డి చూసుకుంటారని శంకర్ రెడ్డి హామీనిచ్చిట్టు దస్తగిరి పేర్కొన్నాడు. 

ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, గుజ్జుల ఉమాశంకర్‌రెడ్డితో కలిసి వివేకాను హత్య చేసినట్టు దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. వివేకా హత్యకు ఎర్ర గంగిరెడ్డి కుట్రపన్నినట్లు దస్తగిరి పేర్కొన్నారు. బెంగళూరు ల్యాండ్ వివాదంలో వాటా ఇవ్వకపోవడంపై ఆగ్రహంతో ఎర్ర గంగిరెడ్డి పగ పెంచుకున్నారని.. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గంగిరెడ్డి మోసం చేశారని, మీ సంగతి తేలుస్తానంటూ గంగిరెడ్డి, అవినాష్‌లకు వివేకా వార్నింగ్‌ ఇచ్చినట్టు దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తర్వాత అవినాష్‌ ఇంటి దగ్గర వాగ్వాదం జరిగిందని స్టేట్‌మెంట్‌లో తెలిపారు. తనను కావాలనే ఓడించారని, మీ కథ తేలుస్తానంటూ అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డి, డి.శంకర్‌రెడ్డిలకు వివేకా వార్నింగ్‌ ఇచ్చినట్లు కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు.

read more  YS Viveka case: అవినాశ్ రెడ్డిని ఇరికించే కుట్ర... ఆధారాలు బయటపెట్టాలి: శ్రీకాంత్ రెడ్డి డిమాండ్

ఎమ్మెల్సీ ఎన్నికల్లో మోసం చేయడంతో ఎర్ర గంగిరెడ్డి, గుజ్జుల జగదీశ్వర్‌రెడ్డిని ఆఫీసుకు పిలిపించి తిట్టినట్టు కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో దస్తగిరి వెల్లడించారు. తర్వాత కొన్ని రోజుల పాటు వైఎస్ వివేకా, గంగిరెడ్డి మధ్య మాటల్లేవని... కోటి రూపాయిలు ఇస్తాం.. వివేకాను హత్యచేయాలని, గంగిరెడ్డి ఆఫర్ చేసినట్టు దస్తగిరి వెల్లడించారు. మొత్తం హత్యకు 40 కోట్ల రూపాయల సుపారీ ఇచ్చారని.. తనకు 5 కోట్లు ఇస్తానని ఆఫర్ చేసి.. కోటి రూపాయలు అడ్వాన్స్ ఇచ్చినట్టు దస్తగిరి చెప్పారు. అయితే తనకు ఇచ్చిన అడ్వాన్స్‌లో 25 లక్షలను సునీల్ యాదవ్ తిరిగి తీసుకున్నాడని చెప్పారు.
 
 

 

click me!