
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Session) నవంబర్ 26 వరకు కొనసాగనున్నాయి. ఈ మేరకు బీఏసీ సమావేశంలో (bac meeting) నిర్ణయం తీసుకన్నారు. గురువారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా.. ఇటీవల బద్వేలు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన దాసరి సుధ (dasari sudha) ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కస్కరిస్తున్నట్టుగా స్పీకర్ తమ్మనేని సీతారాం (Tammineni Sitaram) ప్రకటించారు. టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, ఇతర సభ్యులు.. రాష్ట్రంలో పెట్రోల్, డిజీల్, నిత్యావసరాల ధరల గురించి ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్టుగా చెప్పారు. ఆ తర్వాత ఇటీవల మరణించిన మాజీ సభ్యులకు శాసనసభ సంతాపం తెలిపింది.
ఆ తర్వాత స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం (bac meeting) జరిగింది. ఈ సమావేశానానికి సీఎం వైఎస్ జగన్ (YS Jagan), మంత్రులు బుగ్గన, అనిల్ కుమార్ యాదవ్, కన్నబాబు టీడీపీ నుంచి హాజరైన అచ్చెన్నాయుడు హజరయ్యారు. అసెంబ్లీ సమావేశం ఒక్క రోజు కాకుండా పొడగించాలని టీడీపీ కోరిన వెంటనే ప్రభుత్వం నవంబర్ 26 వరకు సమావేశాలు నిర్వహించడానికి బీఏసీలో నిర్ణయం తీసుకుంది.
Also read: AP Assembly: ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ.. టీడీపీ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన స్పీకర్
అసెంబ్లీ సమావేశాల పొడగింపుకు సంబంధించి ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి.. సభను ఎన్ని రోజులైన కొనసాగించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. టెక్నికల్‌గా ఈరోజు ఒక్కరోజు సభను కొనసాగించాలి కాబట్టి నేడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయని అన్నారు. అయితే ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తర్వాత జరుపుదామని అనుకున్నప్పటికీ.. టీడీపీ వాళ్లు సభ జరపాలని అడిగారు. ఈ క్రమంలోనే సభను 26వ తేదీ వరకు కొనసాగించాలని బీఏసీలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఏ అంశంపైన చర్చించడానికైనా ప్రబుత్వం సిద్దంగా ఉందని వెల్లడించారు.
ఇక, ఈ ఏడాది జూలై నుంచి ప్రభుత్వం వివిధ శాఖలకు సంబంధించి 14 ఆర్డినెన్సులను జారీ చేసింది. ఒకేరోజున 14 ఆర్డినెన్స్‌లను శాసనసభ, శాసన మండలి ఆమోదించేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. మరోవైపు రాష్ట్రంలో ప్రజా సమస్యలపై సభలో చర్చించాలని ప్రతిపక్ష టీడీపీ డిమాండ్ చేస్తోంది.