తిత్లీ తుఫాన్‌కు 8 మంది బలి.. ఉత్తరాంధ్రలో భయానక పరిస్థితి

By sivanagaprasad kodatiFirst Published Oct 11, 2018, 2:15 PM IST
Highlights

ఒడిశాతో పాటు ఏపీలోని ఉత్తరాంధ్రను వణికించిన తిత్లీ తుఫాను రెండు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించింది. తుఫాను కారణంగా ఇప్పటి వరకు 8 మంది దుర్మరణం పాలైనట్లుగా ప్రభుత్వం ప్రకటించింది.

ఒడిశాతో పాటు ఏపీలోని ఉత్తరాంధ్రను వణికించిన తిత్లీ తుఫాను రెండు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించింది. తుఫాను కారణంగా ఇప్పటి వరకు 8 మంది దుర్మరణం పాలైనట్లుగా ప్రభుత్వం ప్రకటించింది.

శ్రీకాకుళం జిల్లాలో ఐదుగురు, విజయనగరం జిల్లాలో ముగ్గురు మృతి చెందారు. సముద్రంలో వేటకు వెళ్లి ఆరుగురు, ఇళ్లు, చెట్టు కూలడంతో ఒక్కొక్కరు మరణించినట్లుగా అధికారులు తెలిపారు. 2 వేల కరెంట్ స్తంభాలు నేలకూలగా.. వేలాది ఎకరాల్లో పంట నష్టం సంభవించింది.

శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు పూర్తిగా అంధకారంలో మునిగిపోగా.. కమ్యూనికేషన్ వ్యవస్థ స్తంభించింది. ఈదురుగాలుల కారణంగా వేలాది చెట్లు నేలకూలాయి. రోడ్లపై అడ్డంగా భారీ వృక్షాలు పడటంతో రోడ్ నెట్ వర్క్ పూర్తిగా స్తంభించింది.

తీర ప్రాంతాలకు వెళ్లే అన్ని మార్గాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. మరోవైపు తుఫాను పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరా తీస్తున్నారు. అమరావతిలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో సహాయ, పునరావాస చర్యలను సమీక్షిస్తున్నారు.

ఏపీకి తిత్లీ ముప్పు: అప్పుడు ఇదే రోజుల్లో హుధూద్

తీరం దాటినా తప్పని ముప్పు.. మరో నాలుగు గంటల పాటు భారీ వర్షాలు

అర్థరాత్రి 12.10 a.m.. ఆయన పనిలో ఆయన

తీరం తాకిన తుఫాను: శ్రీకాకుళం జిల్లా అతలాకుతలం

తిత్లీ తుఫాన్ ఎఫెక్ట్: అల్లకల్లోలంగా సముద్ర తీరం

ముంచుకొస్తున్న ‘‘తిత్లీ’’.. వణుకుతున్న ఉత్తరాంధ్ర

click me!