తిరువూరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 live

By Rajesh Karampoori  |  First Published Jun 4, 2024, 8:53 AM IST

Tiruvuru assembly elections result 2024: ఆంధ్ర ప్రదేశ్ లో ఎస్సీలకు రిజర్వ్ చేసిన నియోజకవర్గాల్లో తిరువూరు ఒకటి. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొక్కిలిగడ్డ రక్షణనిధి కొనసాగుతున్నారు. అయితే ఈసారి సిట్టింగ్ కు కాదని టిడిపి నుండి ఇటీవలే చేరిన నాయకుడికి వైసిపి టికెట్ కేటాయించింది. దీంతో ఎమ్మెల్యే రక్షణనిధి వైసిపికి రాజీనామా చేసి తిరుగుబాటు చేసారు. ఈ నేపథ్యంలో  తిరువూరు పాలిటిక్స్ ఒక్కసారిగా వేడెక్కాయి. ఇలా ఆసక్తికర రాజకీయాల నేపథ్యంలో తిరువూరు ప్రజల తీర్పు ఎలా వుంటుందో చూడాలి. 


Tiruvuru assembly elections result 2024: ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ సమయంలో తిరువూరు  నియోజకవర్గం కాంగ్రెస్ కు కంచుకోట.  1955 నుండి 1972 వరకు వరుసగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే తిరువూరు నుండి ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వా మధ్యలో కొంతకాలం టిడిపి కొనసాగినా కోనేరు రంగారావు లాంటి కాంగ్రెస్ నేత ముందు ఎక్కువకాలం నిలవలేకపోయింది.  1989, 2004 లో కోనేరు రంగారావు, 2009 లో దిరిసం పద్మజ్యోతి తిరువూరు ఎమ్మెల్యేలుగా పనిచేసారు. 
 
అయితే ప్రత్యేక ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటుతర్వాత  జరిగిన రెండు (2014, 2019) అసెంబ్లీ ఎన్నికల్లోనూ తిరువూరు వైసిపి వశమయ్యింది. కొక్కిలిగడ్డ రక్షణనిధి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీచేసి గెలిచారు. కానీ ఇప్పుడు ఆయనను పక్కనబెట్టిన వైసిపి టిడిపి నుండి చేరిన నల్లగట్ల స్వామి దాస్ కు టికెట్ కేటాయించింది. ఈయన 1994, 1999 లో టిడిపి ఎమ్మెల్యేగా పనిచేసారు. 

తిరువూరు నియోజకవర్గ పరిధిలోని మండలాలు : 

Latest Videos

1.  ఎ. కొండూరు 
2. గంపలగూడెం 
3. విస్సన్నపేట
4. తిరువూరు
 
తిరువూరు అసెంబ్లీ ఓటర్లు : 

నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) ‌-  2,03,436

పురుషులు -  1,01,596
మహిళలు ‌-   1,01,832

తిరువూరు అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు : 

వరుసగా రెండుసార్లు తిరువూరులో వైసిపిని గెలిపించిన కొక్కిలిగడ్డ రక్షణనిధిని పక్కనబెట్టింది అధిష్టానం. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగట్ల స్వామిదాస్ ను తిరువూరు బరిలో దింపింది వైసిపి. 

టిడిపి అభ్యర్థి :

తిరువూరులో కొత్త అభ్యర్థిని బరిలోకి దింపింది టిడిపి.  అమరావతి ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన కొలికపూడి శ్రీనివాసరావును తిరువూరు నుండి పోటీలో నిలిపింది టిడిపి.


తిరువూరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ;

తిరువూరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

తిరువూరు నియోజకవర్గాన్ని టీడీపీ గెలుచుకుంది. ఈ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్‌పై విజయం సాధించారు. నల్లగట్ల స్వామి దాస్‌కు 78845 ఓట్లు రాగా, కొలికపూడి శ్రీనివాసరావు 100719 ఓట్లు సాధించారు.

తిరువూరు అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు : 

నియోజకవర్గంలో నమోదైన మొత్తం ఓటర్లు ‌- 2,03,436

పోలయిన మొత్తం ఓట్లు 1,76,453 (86 శాతం)

వైసిపి - కొక్కిలిగడ్డ రక్షణ నిధి - 89,118 (50 శాతం) - 10,835 ఓట్లతేడాతో విజయం 

టిడిపి - కొత్తపల్లి శామ్యూల్ జవహర్ - 78,283 (44 శాతం) -  ఓటమి 

 

తిరువూరు అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు -   1,63,139 (87 శాతం)

వైసిపి - కొక్కిలిగడ్డ రక్షణ నిధి - 78,144 (47 శాతం) - 1,676 ఓట్ల తేడాతో విజయం

టిడిపి  - నల్లగట్ల స్వామి దాస్ - 76,468 (46 శాతం) - ఓటమి

click me!