రాజాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 LIve

Published : Jun 04, 2024, 08:51 AM ISTUpdated : Jun 06, 2024, 04:54 PM IST
రాజాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 LIve

సారాంశం

2009లో నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా రాజాం (ఎస్సీ) ఏర్పాటైంది. రాజాం నియోజకవర్గం ఏర్పడ్డాక 2009లో కాంగ్రెస్ పార్టీ, 2014, 2019లలో వైసీపీలు గెలుపొందాయి. 2019లో కాంగ్రెస్ తరపున కొండ్రు మురళి.. 2014, 2019లలో వైసీపీ తరపున కంబాల జోగులు విజయం సాధించారు. రాజాంలో హ్యాట్రిక్ నమోదు చేయాలని వైపీపీ అధినేత , సీఎం వైఎస్ జగన్ పట్టుదలతో ముందుకు సాగారు. అయితే వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కంబాల జోగులను కాదని, డాక్టర్ తేలే రాజేష్‌ను అభ్యర్ధిగా ప్రకటించడం చర్చనీయాంశమైంది. టీడీపీ జనసేన బీజేపీ కూటమి విషయానికి వస్తే.. రాజాం నుంచి టీడీపీ పోటీ చేసింది.

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని కీలక నియోజకవర్గం రాజాం. కళా వెంకట్రావు, ప్రతిభా భారతి, కొండ్రు మురళి వంటి నేతల అడ్డా రాజాం. 2009లో నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా రాజాం (ఎస్సీ) ఏర్పాటైంది. గతంలో వుణుకూరు, హోంజారం, బొద్దం నియోజకవర్గాలు రద్దయి.. రాజాం ఉనికిలోకి వచ్చింది. వుణుకూరులో టీడీపీ ఆధిపత్యం వహించింది. కిమిడి కళా వెంకట్రావు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ 3 సార్లు, కృషికార్ లోక్ పార్టీ , జనతా పార్టీ, ఇండిపెండెంట్ అభ్యర్ధి ఒకసారి విజయం సాధించారు. హోంజారం నియోజకవర్గంలో కృషికార్ లోక్‌పార్టీ.. బొద్దంలో కాంగ్రెస్ పార్టీలు గెలుపొందాయి. 

రాజాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 .. హ్యాట్రిక్‌పై వైసీపీ కన్ను : 

రాజాం నియోజకవర్గం ఏర్పడ్డాక 2009లో కాంగ్రెస్ పార్టీ, 2014, 2019లలో వైసీపీలు గెలుపొందాయి. 2019లో కాంగ్రెస్ తరపున కొండ్రు మురళి.. 2014, 2019లలో వైసీపీ తరపున కంబాల జోగులు విజయం సాధించారు. రాజాం నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,13,768 మంది.. వీరిలో 1,07,125 మంది పురుషులు.. మహిళలు 1,06,630 మంది. రాజాం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో రాజాం, వంగర, సంతకవిటి, రేగిడి ఆమదాలవలస మండలాలున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి కంబాల జోగులుకు 83,561 ఓట్లు.. టీడీపీ అభ్యర్ధి కొండ్రు మురళీ మోహన్‌కు 66,713 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా వైసీపీ 16,848 ఓట్ల తేడాతో వరుసగా రెండోసారి రాజాంలో విజయం సాధించింది.

2024 ఎన్నికల విషయానికి వస్తే.. రాజాంలో హ్యాట్రిక్ నమోదు చేయాలని వైపీపీ అధినేత , సీఎం వైఎస్ జగన్ పట్టుదలతో వున్నారు. అయితే వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కంబాల జోగులను కాదని, డాక్టర్ తేలే రాజేష్‌ను అభ్యర్ధిగా ప్రకటించడం చర్చనీయాంశమైంది. కొత్త జిల్లాల ఏర్పాటుతో రాజాం విజయనగరం జిల్లా పరిధిలోకి వెళ్లింది. దీంతో ఆ జిల్లాలను శాసిస్తున్న మంత్రి బొత్స కుటుంబం రాజాంపై పట్టు సాధించాలని ప్రయత్నిస్తోంది. 

రాజాం శాసనసభ ఎన్నికల ఫలితాలు 2024 .. 

టీడీపీ జనసేన బీజేపీ కూటమి విషయానికి వస్తే.. రాజాం నుంచి టీడీపీ పోటీ చేయనుంది. నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి తెలుగుదేశం పార్టీకి ఇక్కడ గెలుపు దక్కలేదు. కళా వెంకట్రావు, ప్రతిభా భారతి ఫ్యామిలీలు రాజాంపై కన్నేసినా చంద్రబాబు దయ చూపలేదు. కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన మాజీ మంత్రి కొండ్రు మురళి బరిలో ఉన్నారు. గతంలో మంత్రిగా చేసిన అనుభవం, గత ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి , టీడీపీ జనసేన బీజేపీ కూటమి తనను గెలిపిస్తాయని మురళీ భావిస్తున్నారు. 

రాజాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

రాజాం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుపొందింది. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డాక్టర్ టేల్ రాజేష్‌పై టీడీపీ అభ్యర్థి కొండ్రు మురళీమోహన్ విజయం సాధించారు. కొండ్రు మురళీ మోహన్‌కు 94385 ఓట్లు రాగా, డాక్టర్ టేల్ రాజేష్ 73663 ఓట్లు సాధించారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు