భీమవరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 live

By Rajesh Karampoori  |  First Published Jun 4, 2024, 8:47 AM IST

Bhimavaram assembly elections result 2024: ఆంధ్ర ప్రదేశ్ లోని కీలక నియోజకవర్గాల్లో భీమవరం ఒకటి. పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో భీమవరంకు ప్రత్యేక గుర్తింపు వుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఇక్కడినుండే పోటీచేసి ఓడిపోయారు. దీంతో ఒక్కసారిగా భీమవరం అసెంబ్లీ పేరు రాష్ట్రవ్యాప్తంగా వినిపించింది. ఈసారి కూడా భీమవరం రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. గతంలో టిడిపి, జనసేన వేరువేరుగా పోటీచేయడంతో  వైసిపి లాభపడింది... కానీ ఈసారి ప్రతిపక్షాలు కూటమిగా పోటీచేస్తున్నాయి కాబట్టి భీమవరం పోరు ఆసక్తికరంగా మారింది


Bhimavaram assembly elections result 2024: భీమవరం రాజకీయాలను కాపులు, రాజులు శాసిస్తున్నారు. ఇక్కడ కాపు సామాజికవర్గ ఓటర్లు ఎక్కువగా వుండటంతో 2019లో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పోటీచేసారు. కానీ భీమవరం ప్రజలు పవన్ ను ఓడించి వైసిపిని గెలిపించారు. ఇలా భీమవరం ఎలక్షన్ రిజల్ట్ రాష్ట్ర ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. 

అయితే జనసేన, టిడిపి వేరువేరేగా పోటీచేయడంవల్లే వైసిపి లాభపడింది... కానీ ఈసారి పరిస్థితులు మారిపోయాయి. టిడిపి, జనసేన, బిజెపి కూటమిగా ఏర్పడి పోటీచేస్తుంటే వైసిపి  ఒంటరిగా పోటీచేస్తోంది. కాబట్టి ఈసారి భీమవరం ప్రజాతీర్పు ఎలావుంటుందోనన్న ఆసక్తి రాష్ట్ర ప్రజల్లోనే కాదు రాజకీయ వర్గాల్లో నెలకొంది.

Latest Videos

undefined

భీమవరం నియోజకవర్గ పరిధిలోని మండలాలు : 

1. భీమవరం
2. వీరవాసరం 

భీమవరం అసెంబ్లీ ఓటర్లు : 

నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) - 2,46,424
పురుషులు -  1,20,654
మహిళలు ‌-   1,25,666

భీమవరం అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు : 

వైసిపి అభ్యర్థి :

సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ నే మళ్లీ భీమవరం బరిలో నిలిపింది వైసిపి. 2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ లాంటి బలమైన లీడర్ ను ఎదుర్కొని విజయం సాధించిన గ్రంథిపై నమ్మకంతో మరో అవకాశం ఇచ్చారు. 

జనసేన అభ్యర్థి :  

2024 ఎన్నికల్లోనూ పవన్ కల్యాణ్ భీమవరం నుండే పోటీ చేస్తారంటూ ప్రచారం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్  పిఠాపురం నుండి పోటీ చేయడంతో భీమవరం నుండి మాజీ ఎమ్మెల్యే పులిపర్తి వీరాంజనేయులు పోటీ చేశారు.

భీమవరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు :

భీమవరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

భీమవరం నియోజకవర్గాన్ని జనసేన పార్టీ గెలుచుకుంది.  వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పై జనసేనకు చెందిన రామాంజనేయులు పులపర్తి (అంజిబాబు) 130424 ఓట్లతో విజయం సాధించారు.

భీమవరం అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు : 

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,92,061 (77 శాతం)

వైసిపి -  గ్రంథి శ్రీనివాస్  - 70,642 ఓట్లు (36 శాతం) - 8,357 ఓట్ల మెజారిటీతో ఘన విజయం 

జనసేన పార్టీ - పవన్ కల్యాణ్ - 62,285 (32 శాతం) - ఓటమి

టిడిపి - పులపర్తి రామాంజనేయులు ‌‌- 54,035 (28 శాతం)

భీమవరం అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు -   1,75,871 (77 శాతం)

టిడిపి - పులపర్తి రామాంజనేయులు - 90,772 (51 శాతం) ‌- 13,726 ఓట్ల మెజారిటీతో విజయం 

వైసిపి - గ్రంథి శ్రీనివాస్ - 77,046 (43 శాతం) - ఓటమి 

 

click me!