టీటీడీ ఆదాయ, వ్యయాలపై కాగ్‌తో ఆడిట్: సుబ్రమణ్యస్వామి హర్షం

Published : Sep 03, 2020, 12:47 PM IST
టీటీడీ ఆదాయ, వ్యయాలపై కాగ్‌తో ఆడిట్: సుబ్రమణ్యస్వామి హర్షం

సారాంశం

టీటీడీ ఆదాయ, వ్యయాలను కాగ్ (కంప్రోటర్ అండ్ ఆడిటర్ జనరల్) తో ఆడిట్ చేయించాలని తీసుకొన్న నిర్ణయాన్ని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి స్వాగతించారు.

అమరావతి: టీటీడీ ఆదాయ, వ్యయాలను కాగ్ (కంప్రోటర్ అండ్ ఆడిటర్ జనరల్) తో ఆడిట్ చేయించాలని తీసుకొన్న నిర్ణయాన్ని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి స్వాగతించారు.  ఈ నిర్ణయం తీసుకొన్నందుకు టీటీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డికి సీఎం వైఎస్ జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా  ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. 

చంద్రబాబు ప్రభుత్వంలో ఐదేళ్లలో టీటీడీలో నిధుల వ్యయాన్ని కాగ్ తో అడిటింగ్ చేయించడంతో పాటు ఇక ముందు కూడ ఇలాగే చేయాలని కోరుతూ సత్యపాల్ సబర్వాల్ తో కలిసి సుబ్రమణ్యస్వామి గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

 

2020-21 నుండి టీటీడీ ఆదాయ, వ్యయాలను కాగ్ తో ఆడిట్ చేయాలని గత నెల 28వ తేదీన టీటీడీ పాలకవర్గం తీర్మానం చేసింది.2014 నుండి 2019 వరకు టీటీడీ నిధుల వ్యయాన్ని కాగ్ తో ఆడిటింగ్ చేయించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరింది. 

PREV
click me!

Recommended Stories

Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!