చిన్న పిల్లల అశ్లీల వీడియో.. ముగ్గురి అరెస్ట్

By telugu news teamFirst Published Aug 25, 2021, 9:23 AM IST
Highlights

చిన్నపిల్లలు, మహిళలపై జరుగుతున్న సైబర్‌ నేరాలను గుర్తించి చర్యలు తీసుకోవడంతో పాటు వాటిని అరికట్టడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు

చిన్న పిల్లల అశ్లీల వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన తిరుపతిలో చోటుచోసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను తిరుపతి  అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు వివరించారు.

చిన్నపిల్లలు, మహిళలపై జరుగుతున్న సైబర్‌ నేరాలను గుర్తించి చర్యలు తీసుకోవడంతో పాటు వాటిని అరికట్టడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. ఈ క్రమంలో నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ మిస్సింగ్‌ అండ్‌ ప్లోయిడ్‌ చిల్డ్రన్‌ (ఎన్‌సీఎంఈసీ)తో కలిసి రాష్ట్ర పోలీసు శాఖ పనిచేస్తోందని ఎస్పీ తెలిపారు. ఎన్‌సీఎంఈసీ ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాను పర్యవేక్షిస్తూ ఉంటుందన్నారు. 

చిన్నపిల్లలకు సంబంధించి అశ్లీల వీడియోలను ఎవరైనా అప్‌లోడ్‌ చేసినా, సర్క్యులేట్‌ చేసినా సీఐడీకి సమాచారం ఇస్తుందన్నారు. వారి ద్వారా సంబంధిత జిల్లా పోలీసులకు సమాచారం వస్తుందన్నారు. అలా సీఐడీ ఇచ్చిన సమాచారం మేరకు జిల్లా సైబర్‌క్రైమ్‌ సిబ్బంది కొంతకాలంపాటు దర్యాప్తు చేసినట్లు చెప్పారు. ఈ క్రమంలో చిన్నపిల్లల అశ్లీల వీడియోలను అప్‌లోడ్‌ చేసినందుకు ఆరు కేసులు నమోదు చేసి, మొత్తం 30 మందిని గుర్తించామని వివరించారు. వీరిలో చాలామంది దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉండటంతో వారి వివరాలను ఆయా ప్రదేశాల పోలీసులకు ఇచ్చామన్నారు. తిరుపతి పరిధిలో ఆరుగురిని గుర్తించగా, ప్రస్తుతం ముగ్గురిని అరెస్ట్‌ చేశామని ఎస్పీ వివరించారు.

click me!