రమ్య హత్య కేసులో దర్యాప్తు అధికారుల పనితీరు భేష్: ఎస్సీ కమీషన్ బృందం

By Arun Kumar PFirst Published Aug 24, 2021, 5:04 PM IST
Highlights

ప్రేమోన్మాది చేతిలో అత్యంత కిరాతకంగా హత్యకు గురయిన రమ్య కేసులో దర్యాప్తు అధికారుల పనితీరు దేశానికే ఆదర్శనమని ఇవాళ రాష్ట్రంలో పర్యటించిన ఎస్సీ కమీషన్ బృందం పేర్కొంది. 

అమరావతి; గుంటూరులో బిటెక్ విద్యార్ధిని రమ్య హత్య కేసులో దర్యాప్తు అధికారుల పనితీరు భారతదేశానికే ఆదర్శమని జాతీయ ఎస్‌సి కమిషన్ బృందం పేర్కొంది. దళిత యువతి హత్య కేసులో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం అత్యంత వేగంగా స్పందించిందని తమ విచారణలో తేలిందని కమిషన్ బృందం వెల్లడించింది. 

రమ్య హత్యకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు వచ్చిన ఎస్సీ కమీషన్ సభ్యులు సీఎం  జగన్ ను కలిశారు. ఈ సందర్భంగా కమీషన్ ఉపాధ్యక్షులు అరుణ్ హల్దార్ తో పాటు మిగతా సభ్యులకు సీఎం జగన్ శాలువాతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు.  ఈ సందర్భంగా ఎస్సీ కమీషన్ బృందంతో సీఎం జగన్ కాస్సేపు భేటీ అయ్యారు. 

వీడియో

అనంతరం కమీషన్ సభ్యులు మాట్లాడుతూ... ''రమ్య కుటుంబ సభ్యులతో మాట్లాడాము. ఘటన అనంతరం ప్రభుత్వం, పోలీసులు తీసుకున్న చర్యలు పట్ల వారుకూడా సంతృప్తి వ్యక్తం చేశారు. హత్యకు పాల్పడిన ముద్దాయిని అరెస్ట్ చేసి ఆరు రోజుల్లోనే పోలీసులు చార్జ్ షీట్ దాఖలు చేశారు. గుంటూరు అర్బన్, రూరల్ ఎస్పీలతో పాటు స్థానిక డి‌ఐజీ పర్యవేక్షణలో వివిధ శాఖల సమన్వయంతో కేసు దర్యాఫు పూర్తి చేశారు'' అని తెలిపారు.

''ఈ కేసు దర్యాప్తులో పాల్గొన్న అధికారులందరికీ ఎస్సీ కమీషన్ తరపున అవార్డులు అందేవిధంగా కృషి చేస్తాం'' అని జాతీయ ఎస్సీ కమీషన్ సభ్యులు అన్నారు. 

read more  ఏపీ సీఎస్, డిజిపి తో జాతీయ ఎస్సి కమీషన్ బృందం సమావేశం

సీఎం జగన్ కు కలవడానికి ముందు సచివాలయంలో సిఎస్ ఆదిత్యనాధ్ దాస్, డిజిపి గౌతమ్ సవాంగ్ లతో జాతీయ ఎస్సి కమీషన్ ఉపాధ్యక్షులు అరుణ్ హల్దార్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కమీషన్ ఇతర సభ్యులతో పాటు ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ ఇంచార్జి ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, కమీషనర్ హర్ష వర్ధన్, పోలీస్ శాఖ డిఐజిలు రాజకుమారి, రాజశేఖర్, గుంటూరు జిల్లా రూరల్ అండ్ అర్బన్ ఎస్పీ తదితరులు పాల్గొన్నారు. 

రమ్య హత్యతో పాటు రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులపై ఎస్సి కమిషన్ బృందానికి టిడిపి నాయకులు ఫిర్యాదు చేశారు. అంతకుముందు రాష్ట్రానికి విచ్చేసిన జాతీయ ఎస్సీ కమీషన్ బృందానికి గన్నవరం విమానాశ్రయంలో బిజెపి ముఖ్య నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు.  
 

click me!