వెలిగొండను గెజిట్‌లో చేర్చండి.. లేదంటే మా జిల్లా ఎడారే: సీఎం జగన్‌కు ప్రకాశం టీడీపీ నేతల లేఖ

By Siva KodatiFirst Published Aug 24, 2021, 9:27 PM IST
Highlights

వెలిగొండ ప్రాజెక్ట్‌ను గెజిట్‌లో చేర్చడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రకాశం జిల్లా టీడీపీ ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేలు సీఎం జగన్‌కు లేఖ రాశారు. కేంద్రంతో మాట్లాడి ప్రాజెక్ట్‌ను గెజిట్‌లో చేర్పించాలని కోరుతున్నామన్నామని టీడీపీ నేతలు లేఖలో పేర్కొన్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు లేఖ రాశారు. ప్రకాశం జిల్లా స్వప్నం వెలిగొండ ప్రాజెక్ట్ అని లేఖలో అన్నారు. వెలిగొండ ప్రాజెక్ట్ నిలిపివేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ సర్కార్ లేఖ రాసిందని టీడీపీ నేతలు గుర్తుచేశారు. వెలిగొండ ప్రాజెక్ట్‌ను గెజిట్‌లో చేర్చడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారు ఎద్దేవా చేశారు. కేంద్రంతో మాట్లాడి ప్రాజెక్ట్‌ను గెజిట్‌లో చేర్పించాలని కోరుతున్నామన్నామని టీడీపీ నేతలు లేఖలో పేర్కొన్నారు. గెజిట్‌లో చేర్చకుంటే వెలిగొండ ప్రాజెక్ట్ ప్రశ్నార్థకం అవుతోందని .. ఉమ్మడి ఏపీలోనే అత్యంత వెనుకబడ్డ ప్రాంతం ప్రకాశం జిల్లా అని వారు గుర్తుచేశారు. కరువు కాటకాలతో ప్రకాశం జిల్లా ఎడారిగా మారుతోందని టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. 

ALso Read:కేఆర్ఎంబీ సమావేశం వాయిదా... సెప్టెంబర్ ఒకటికి మార్పు

కాగా, కృష్ణా బోర్డుకు తెలంగాణ ఈఎన్‌సీ సోమవారం లేఖ రాసింది. వెలిగొండ ప్రాజెక్టును ఏపీ అక్రమంగా నిర్మిస్తోందని తెలంగాణ ఆరోపించింది. వెలిగొండ ప్రాజెక్టు పనులను తక్షణం నిలిపివేసేలా ఆదేశించాలని కేఆర్‌ఎంబీకి రాసిన లేఖలో పొందు పరిచారు. అంతేకాకుండా.. తాగునీటి కోసం వినియోగించే జలాలను 20 శాతం మాత్రమే లెక్కించాలని లేఖలో పేర్కొంది. బచావత్‌ ట్రిబ్యునల్‌ ప్రకారం 20 శాతంగానే లెక్కించాలని కోరింది తెలంగాణ ఇరిగేషన్ శాఖ.
 

click me!