గోవిందస్వామి ఆలయంలో కిరీటం మిస్సింగ్.. ఒకరి అరెస్ట్

By ramya NFirst Published Apr 9, 2019, 11:40 AM IST
Highlights

తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో రెండు నెలల క్రితం మూడు కిరీటాలు మిస్సయిన సంగతి తెలిసిందే. 

తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో రెండు నెలల క్రితం మూడు కిరీటాలు మిస్సయిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ కేసులో పోలీసులు ఒకరిని అరెస్ట్ చేశారు.

తిరుపతిలో ఉండే గోవిందరాజ స్వామి ఆలయంలో ఉత్సవ మూర్తులకు కిరీటాలను అలంకరిస్తారు. వాటిలో మూడు కిరీటాలు మాయం అయ్యాయి.  వాటి బరువు 1,351గ్రాములు అని అధికారులు తెలిపారు. వాటి విలువ రూ.50లక్షల దాకా ఉంుటంది.   ఉత్సవ మూర్తులకు అలంకరించే కిరీటాలు మాయం కావడం సంచలనంగా మారింది. 

ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వారు దీనిపై విచారణ చేపట్టారు. ఆలయంలో ఉండే సీసీటీవీ కెమెరాలను అధికారులు పరిశీలించారు.  దాని ఆధారంగా ఈ కేసుకు సంబంధించి ఆకాశ్ ప్రతాప్ అనే వ్యక్తిని ముంబయిలో పోలీసులు పట్టుకున్నారు. అతను ముంబయికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.

పోలీసుల దర్యాప్తులో నేరం తానే చేసినట్లు అతను అంగీకరించాడు. స్థానిక బంగారు దుకాణదారుడికి ఆ మూడు కిరీటీలను రూ.3లక్షలకు అమ్మినట్లు అంగీకరించాడు. కాగా.. ఆ కిరీటాలను తిరిగి ఆలయానికి చేర్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 
 

click me!