గంగిరెడ్డి చెబితేనే రక్తపు మరకలు తుడిచేశాం: వైఎస్ వివేకా పీఏ

By Siva KodatiFirst Published Apr 9, 2019, 7:51 AM IST
Highlights

వైఎస్ వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి వాంగ్మూలంలో పోలీసులకు పలు కీలక అంశాలు తెలిశాయి. వివేకా గుండెపోటుతో చనిపోయి ఉంటారని చెప్పింది ఎర్ర గంగిరెడ్డేనని కృష్ణారెడ్డి తెలిపారు

వైఎస్ వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి వాంగ్మూలంలో పోలీసులకు పలు కీలక అంశాలు తెలిశాయి. వివేకా గుండెపోటుతో చనిపోయి ఉంటారని చెప్పింది ఎర్ర గంగిరెడ్డేనని కృష్ణారెడ్డి తెలిపారు.

గంగిరెడ్డి ఆదేశాల మేరకే లక్ష్మీ, రాజశేఖర్ బెడ్‌రూమ్‌లో రక్తపు మరకలు తుడిచారని.. తర్వాత గంగిరెడ్డి, ఇనాయతుల్లా, ట్యాంకర్ బాషా, రాజశేఖర్‌తో కలిసి వివేకానందరెడ్డి మృతదేహాన్ని బాత్‌రూం నుంచి బెడ్‌రూమ్‌కు తీసుకొచ్చినట్లు కృష్ణారెడ్డి తెలిపారు.

ఆ మేరకు పులివెందుల న్యాయస్థానానికి సమర్పించిన నిందితుల వాంగ్మూలం రిపోర్టులో పోలీసులు తెలిపారు. గత నెల 15న వైఎస్ వివేకా పులివెందులలోని తన స్వగృహంలో దారుణహత్యకు గురైన సంగతి తెలిసిందే.

ఆ ఘటన సాక్ష్యాలు తారుమారు చేశారనే అభియోగంపై ఎర్ర గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాశ్ అనే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో వీరికి న్యాయస్థానం రిమాండ్ విధించింది.

అనంతరం కోర్టు అనుమతితో వీరిని పోలీసులు నాలుగు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించారు. కస్టడీ గడువు ముగియడంతో నిందితులు ముగ్గురిని సోమవారం పులివెందుల న్యాయస్థానంలో హాజరు పరిచారు. వీరికి ఈ నెల 22వ తేదీ వరకు జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. 

click me!