యారాడ బీచ్ లో కొనసాగుతున్న గాలింపు, ఒకరి మృతదేహం లభ్యం

By Nagaraju TFirst Published Nov 12, 2018, 5:11 PM IST
Highlights

విశాఖపట్నం జిల్లా యారాడ బీచ్ లో విహారయాత్రలో విషాదం నెలకొంది. వీకెండ్ సందర్భంంగా విశాఖ హౌసింగ్ బోర్డు, కేఆర్ఎం కాలనీ, వెంకోజిపాలెంకు చెందిన 12 మంది యువకులు సరదగా గడుపుదామని యారాడ బీచ్ కు వెళ్లారు. అయితే మధ్యాహ్నాం వరకు సంతోషంగా గడిపిన వారు 2.15 నిమిషాలకు సముద్రంలో స్నానానికి దిగారు. 

విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా యారాడ బీచ్ లో విహారయాత్రలో విషాదం నెలకొంది. వీకెండ్ సందర్భంంగా విశాఖ హౌసింగ్ బోర్డు, కేఆర్ఎం కాలనీ, వెంకోజిపాలెంకు చెందిన 12 మంది యువకులు సరదగా గడుపుదామని యారాడ బీచ్ కు వెళ్లారు. అయితే మధ్యాహ్నాం వరకు సంతోషంగా గడిపిన వారు 2.15 నిమిషాలకు సముద్రంలో స్నానానికి దిగారు. 

అయితే గజా తుఫాన్ ప్రభావంతో సముద్రంలో పెద్ద ఎత్తున అలలు ఎగిసిపడ్డాయి. ఈ అలల ధాటికి 12 మంది గల్లంతయ్యారు. వారిని చూసిన స్థానిక మత్స్యకారులు ఐదుగురిని కాపాడారు. మిగిలిన ఏడుగురు గల్లంతయ్యారు. వారిలో ఒకరిని కోస్ట్ గార్డ్ సిబ్బంది రక్షించారు. 

Latest Videos

మిగిలిన ఆరుగురు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా  చేపట్టారు. అటు సీఎం చంద్రబాబు సైతం ప్రమాదంపై స్పందించారు. గాలింపు చర్యలను వేగవంతం చెయ్యాలని అధికారులను ఆదేశించారు. 

ఈ నేపథ్యంలో కోస్ట్‌గార్డ్, నేవీ బృందాలు ఓ హెలికాఫ్టర్, మూడ బోట్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే సోమవారం సాయంత్రం సముద్రపు ఒడ్డున ఓ యువకుడి మృతదేహాన్ని రెస్క్యూ టీం గుర్తించింది. యువకుడు ఆదివారం గల్లంతైన దుర్గగా గుర్తించారు. మృతదేహాన్ని విశాఖపట్నం కేజీహెచ్ కు తరలించారు.  

ఇంకా వాసు, గణేశ్‌, రాజేశ్‌, తిరుపతి, శ్రీనుల ఆచూకీ తెలియాల్సి ఉంది. వారి కోసం పోలీసులు, కోస్ట్ గార్డ్స్, నేవీ సిబ్బంది, రెస్క్యూ టీంలు సహాయక చర్యలను వేగవంతం చేశాయి. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న యువకులు సముద్రంలో గల్లంతైపోవడంతో వారి కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. 

ఈ వార్తలు కూడా చదవండి

విశాఖ యారాడ బీచ్ లో ఏడుగురు గల్లంతు, గాలిస్తున్న కోస్ట్ గార్డ్స్

విశాఖ యారాడ బీచ్‌లో ఆరుగురు గల్లంతు: ఇంకా దొరకని ఆచూకీ

click me!