అమరావతిని కావాలనే ముంచారంటూ ఆరోపించారు. వరద ప్రాంతంగా అమరావతిని చూపించి రాజధానిని తరలించేందుకు వైసీపీ కుట్రపన్నుతోందని ఆరోపించారు. రాజధాని తరలిపోకుండా తాను ఎంతవరకైనా పోరాడుతానని చంద్రబాబు సవాల్ చేశారు.
విజయవాడ: నవ్యాంధ్ర రాజధాని అమరావతిపై మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. రాష్ట్రరాజధాని అమరావతిపై ప్రభుత్వంలో చర్చ జరుగుతోందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతిపై త్వరలో ప్రభుత్వం నిర్ణయం ప్రకటిస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిపై మంత్రి బొత్స దారుణంగా మాట్లాడుతున్నారంటూ విమర్శించారు.
రాజధాని నిర్మాణాన్ని ఆపి ఇప్పుడు దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణానికి రైతులు ఉదారంగా 33వేల ఎకరాలు ఇచ్చారని బొత్స వ్యాఖ్యలతో రైతులను నిండా ముంచేసినట్లవుతుందన్నారు. రాజధానికి అన్నిమౌళిక సదుపాయాలు పోనూ 8వేల ఎకరాలు మిగిలుతుందని తెలిపారు.
అమరావతిని కావాలనే ముంచారంటూ ఆరోపించారు. వరద ప్రాంతంగా అమరావతిని చూపించి రాజధానిని తరలించేందుకు వైసీపీ కుట్రపన్నుతోందని ఆరోపించారు. రాజధాని తరలిపోకుండా తాను ఎంతవరకైనా పోరాడుతానని చంద్రబాబు సవాల్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
రాజధాని తరలిపోతుంది, అమరావతిపై వైసీపీ కుట్ర: మాజీమంత్రి దేవినేని ఉమా ఫైర్
అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన కామెంట్స్
అమరావతికి జగన్ సర్కార్ ఎసరు?: టీడీపీ ప్రచారం అదే