తిరుమల ఆనంద నిలయం వీడియో రికార్డ్: కరీంనగర్ వాసి రాహుల్ రెడ్డి అరెస్ట్

By narsimha lode  |  First Published May 12, 2023, 1:53 PM IST

తిరుమల ఆనంద నిలయం వీడియోను తీసిన కేసులో  కరీంనగర్ కు చెందిన రాహుల్ రెడ్డిని  పోలీసులు అరెస్ట్  చేశారు


తిరుపతి: తిరుమల శ్రీవారి  ఆనంద నిలయం  వీడియో తీసిన  కేసులో  పోలీసులు పురోగతి  సాధించారు. కరీంనగర్ జిల్లాకు చెందిన రాహుల్ రెడ్డిని పోలీసులు  అదుపులోకి తీసుకున్నారు.  తిరుమల శ్రీవారి ఆలయంలోకి  ఉద్దేశ్యపూర్వకంగా మొబైలో ను తీసుకెళ్లి  ఆనంద నిలయం  చిత్రీకరించారని   టీటీడీ  అధికారులు    అనుమానిస్తున్నారు.   రాహుల్ రెడ్డి  ఆలయంలోకి  మొబైల్ ను ఎలా తీసుకెళ్లారనే విషయమై   భద్రతా సిబ్బంది ఆరా తీస్తున్నారు.  భద్రతా వైఫల్యంపై  విచారణ  చేస్తామని  టీటీడీ ఈవో ధర్మారెడ్డి  చెప్పారు. ఈ విషయంలో  బాధ్యులైన   భద్రత అధికారులపై  చర్యలు తీసుకుంటామని  ఈవో ధర్మారెడ్డి  ప్రకటించారు. 

ఈ నెల 8వ తేదీన   తిరుమల శ్రీవారి ఆనంద నిలయం  వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విషయమై టీటీడీ  భద్రతా సిబ్బంది   రంగంలోకి  దిగి విచారణ  ప్రారంభించారు.   కరీంనగర్ కు చెందిన  రాహుల్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నామని  ఈఓ ధర్మారెడ్డి చెప్పారు. 

Latest Videos

undefined

తిరుమల ఆలయంలోకి  మొబైల్స్ వంటి ఎలక్ట్రానిక  వస్తువులు  తీసుకెళ్లడం నిషేధం. కానీ ఈ నిషేధం  ఉన్నా కూడా  రాహుల్ రెడ్డి మొబైల్ ఫోన్ ను  ఆలయంలోకి ఎలా తీసుకెళ్లారనే విషయమై  ఇప్పుడు  టీటీడీ అధికారులు  దర్యాప్తు  చేయనున్నారు. 

గత నెలలో  టీటీడీ ఆలయంపై నుండి  హెలికాప్టర్లు  చక్కర్లు కొట్టాయి.  నో ఫ్లై  జోన్  ప్రాంతమైన  తిరుమలలో  హెలికాప్టర్లు  చక్కర్లు  కొట్టాయి.  ఈ విషయమై  భద్రతా సిబ్బంది రంగంలోకి దిగారు.  అయితే  ఆర్మీకి చెందిన  హెలికాప్టర్లు  తిరుమల మీదుగా   చెన్నైకి  బయలుదేరాయని  సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. 

తిరుమలలో భద్రతా వైఫల్యాన్ని  సీరియస్ గా తీసుకుంటామని   టీటీడీ ఈవో  ధర్మారెడ్డి  స్పష్టం  చేశారు.  విధుల విషయంలో  భద్రతా సిబ్బంది ఎవరైనా నిర్లక్ష్యంగా  ఉన్నారా  అనే విషయమై  కూడా దర్యాప్తు  నిర్వహిస్తున్నామని  కూడా  ఈవో చెప్పారు. 

గత నెలలో  తిరుమలలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారని  ఎస్పీకి  మెయిల్ వచ్చింది.ఈ మెయిల్  ఫేక్ అని  పోలీసులు తేల్చి చెప్పారు.  ఈ మెయిల్ ఆధారంగా  తిరుమలలో  భద్రతా సిబ్బంది విస్తృతంగా  తనిఖీలు  చేశారు. 
 

 

click me!