టీడీపీకి ఓటేస్తే సంక్షేమ పథకాలు ఆగినట్టే: కావలి సభలో బాబు, పవన్ పై జగన్ ఫైర్

By narsimha lode  |  First Published May 12, 2023, 1:02 PM IST

చుక్కల భూములను నిషేధిత  జాబితా నుండి  ఏపీ  ప్రభుత్వం  తొలగించింది.  ఈ మేరకు నెల్లూరు కావలిలో  రైతులకు  హక్కు పత్రాలను  సీఎం జగన్  ఇవాళ పంపిణీ చేశారు.  
 


నెల్లూరు: చంద్రబాబుకు  ఓటు వేస్తే  సంక్షేమ పథకాలు  ఆగినట్టేనని    ఏపీ సీఎం వైఎస్ జగన్  చెప్పారు.  బాబు సర్కార్  వస్తే  ప్రస్తుతం  రాష్ట్రంలోని సంక్షేమ పథకాలు నిలిచిపోతాయన్నారు.  శుక్రవారంనాడు  నెల్లూరు జిల్లాలోని కావలిలో  చుక్కల భూములపై నిషేధం ఎత్తివేస్తూ  రైతులకు  హక్కు పత్రాలను  సీఎం జగన్  పంపిణీ  చేశారు. ఈ సందర్భంగా  నిర్వహించిన  సభలో  ఆయన  ప్రసంగించారు.   చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారం పొలిటికల్ యాక్షన్  చేస్తున్నారని  జగన్  విమర్శించారు.  ప్యాకేజీ తీసుకున్న ప్యాకేజీ స్టార్  బాబు వైపున నిలబడ్డారని  సీఎం జగన్ పవన్ పై  వ్యంగ్యాస్త్రాలు సంధించారు.   ఎవరి డ్రామా వాళ్లు ఆడుతున్నారన్నారు.  

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు  పర్యటిస్తున్నారనే  రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేస్తున్నామని  ప్రచారం చేస్తున్నారని  సీఎం మండిపడ్డారు.  వీళ్లు వచ్చినా, రాకున్నా ఈ నాలుగేళ్లు  ఎవరు కొన్నారని  సీఎం  ప్రశ్నించారు.   చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు  రైతు బాంధవుల వేషాలు వేసుకున్నారన్నారు.  2014 ఎన్నికలకు ముందు  రుణ మాఫీ చేస్తామన్న  చంద్రబాబు  ఏం చేశారన్నారు. ప్రశ్నిస్తామన్న పవన్ కళ్యాణ్  ఎందుకు  నోరు మెదపలదేని  జగన్  అడిగారు.  ఇప్పుడేమో రైతుల వద్దకు వెళ్లి మొసలి కన్నీరు కారుస్తున్నారని  జగన్  మండిపడ్డారు.

Latest Videos

undefined

రాష్ట్రంలో సంక్షేమ పథకాల విషయంలో  చంద్రబాబు  గ్యాంగ్  తప్పుడు  ప్రచారం చేస్తుందన్నారు.  జీవీరావు అనే వ్యక్తి  ద్వారా  దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.  జీవీరావు  చార్టెడ్  అకౌంటెంట్ సర్వీస్ రద్దైందని  సీఎం జగన్  గుర్తు చేశారు.    ఇలాంటి దానయ్కకు  కోటు తొడిగి  ఆర్ధిక నిపుణుడిగా  చూపించారన్నారు.   రాష్ట్రంలో  సంక్షేమ పథకాలు  వద్దని  దివాళా తీస్తుందని చెప్పిస్తున్నారని  జగన్  విమర్శించారు.  పొరపాటు జరిగితే  రాష్ట్రంలో  పేదలు  బతికే  పరిస్థితి రాష్ట్రంలో  ఉండదన్నారు. పేదలను  ఏపీ నుండి తరిమేస్తారన్నారు. పేదలకు , పెత్తందార్లకు  జరిగే యుద్ధంగా  

అమరావతిలో  పేదలకు  ఇళ్ల పట్టాలు ఇస్తామంటే  చంద్రబాబుకు కడుపు మంట అని  జగన్ విమర్శించారు.  అందుకే  కోర్టులకు వెళ్లి  పేదలకు  ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా అడ్డుకునే  ప్రయత్నం  చేశారని  జగన్  చెప్పారు.  తమ  పాలనలో మీకు  న్యాయం జరిగిందని  నమ్మితే  తనకు  అండగా నిలవాలని  సీఎం జగన్ ప్రజలను  కోరారు.  తమ ప్రభుత్వం  విద్యా రంగంలో తీసుకువచ్చిన విధానాల వల్ల  మరో  15 ఏళ్లలో  ప్రతి విద్యార్ధి ఇంగ్లీష్ లో మాట్లాడే పరిస్థితి వస్తుందన్నారు.  కొన్నేళ్లలో  స్కిల్డ్ వర్క్ ఫోర్స్ లో  ఏపీ రాష్ట్రం దేశానికే దిక్సూచి  అవుతుందన్నారు. చదువులపై  ఖర్చును  హ్యాుమన్  క్యాపిటల్ ఇన్వెస్ట్ మెంట్ గా  భావించాలని  సీఎం జగన్  చెప్పారు .

చుక్కల భూముల సమస్యకు శాశ్వత  పరిష్కారం చూపించినట్టుగా  ఏపీ సీఎం జగన్  చెప్పారు. వేలమంది  రైతులకు విముక్తి కల్పించామన్నారు. తమ ప్రభుత్వం  తీసుకున్న నిర్ణయంతో  2,06, 171  ఎకరాల్లోని చుక్కల భూములకు శాశ్వత  పరిష్కారం దక్కిందన్నారు. 

 గతంలో  అధికారంలో ఉన్న చంద్రబాబునాయుడు  సర్కార్  ఈ భూములను నిషేధిత  జాబితాలో  చేర్చి  రైతులను ఇబ్బందులకు  గురి చేసిందని ఆయన  విమర్శించారు. చంద్రబాబు  రైతులను కోలుకోలేని  దెబ్బకొట్టారన్నారు. 

 తమ ప్రభుత్వం రైతులకు  మేలు చేయాలనే ఉద్దేశ్యంతో  చుక్కల భూముల్ని  నిషేధిత జాబితా నుండి తొలగించినట్టుగా  జగన్  చెప్పారు. చుక్కల భూములపై  ఇక నుండి రైతులకు  అన్ని హక్కులు దక్కుతాయన్నారు. చుక్కల భూముల హక్కులతో బ్యాంకు రుణాలు కూడా తీసుకోవచ్చన్నారు.  వారసత్వపు ఆస్తిగా  అందించడానికి  వెసులుబాటు  కూడా  దక్కుతుందని  సీఎం  తెలిపారు,.   


రైతు బాగుంటేనే  రాష్ట్రం బాగుంటుందని  నమ్మే ప్రభుత్వం తమదన్నారు. అందుకే   చుక్కల భూములను నిషేధిత జాబితా నుండి తొలగించినట్టుగా జగన్ వివరించారు. రైతన్నల కష్టం తాను  స్వయంగా  చూసినట్టుగా సీఎం  చెప్పారు.  మీకు  తాను అండగా  ఉన్నట్టుగా  సీఎం తెలిపారు.  ఇప్పటికే  గిరిజనులకు  ఆర్ఓఎఫ్ఆర్  పట్టాలు పంపిణీ  చేశామన్నారు.గతంలో  అవనిగడ్డ  నియోజకవర్గంలో  రైతుల  సమస్యలను పరిష్కరించినట్టుగా  ఆయన గుర్తు  చేశారు.  ప్రతి రెవిన్యూ గ్రామంలో  భూ సర్వే  వేగంగా జరుగుతుందన్నారు.  ఇప్పటికే  2 వేల  గ్రామాల్లో భూ సర్వే  పూర్తి  చేశామన్నారు. భూహక్కు పత్రాలు కూడా  వేగంగా  ఇస్తున్నామన్నారు. ఈ నెల  20న మరో  2 వేల గ్రామాల్లో  భూ హక్కు పత్రాలు పంపిణీ చేస్తామన్నారు.

ఆర్‌బీకేల ద్వారా రైతులకు  ఎన్నో సేవలు అందుబాటులోకి తెచ్చినట్టుగా  సీఎం  చెప్పారు.  దళారీ  వ్యవస్థ  లేకుండా  చేసి రైతులకు  మేలు చేశామన్నారు. గతంలో  ఎన్నడూ  జరగని  మంచి ఇప్పుడు  రైతులకు  జరుగుతుందన్నారు. నాలుగేళ్లుగా  రైతన్నల కోసమే  వేశామన్నారు. 

click me!