
నోట్ల రద్దు ప్రభావం ఆ కలియుగ వైకుంఠుడి క్షేత్రంపైనా కూడా పడింది. తిరుమలలో భక్తుల తీవ్ర ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని దేవదేవుడి క్షేత్రాన్ని నగదురహితంగా చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సంకల్పించింది.
ఇందులో భాగంగా ఏడుకొండల వాడి చెంత ఆన్ లైన్ లోనే అన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు నిర్ణయించింది.
టికెట్ ల పంపిణీ, భక్తులకు ప్రసాదం అమ్మకాలు, ఆర్జిత సేవలు ఇలా అన్నింటికి క్యాష్ లెస్ పేమెంట్ చేసేలా చర్యలు తీసుకోనున్నారు.
ఇప్పటికే తిరుమలకు సంబంధించిన చాలా సేవలు ఆన్ లైన్లోనే కొనసాగుతున్నాయి. ఇకపై పూర్తి స్థాయిలో అన్ని సేవలు ఆన్ లైన్ లో అందుబాటులోకి వస్తాయి.
ఇదే జరిగితే దేశంలోనే తొలి నగదురహిత పుణ్య క్షేత్రంగా నిలిచి తిరుమల క్షేత్రం మరో రికార్డు సృష్టించనుంది.