సెప్టెంబర్ 27 నుండి తిరుమల బ్రహ్సోత్సవాలు: రూ. 300 దర్శనాలు రద్దుకు టీటీడీ నిర్ణయం

Published : Jul 28, 2022, 03:54 PM ISTUpdated : Jul 28, 2022, 04:10 PM IST
సెప్టెంబర్ 27 నుండి తిరుమల బ్రహ్సోత్సవాలు: రూ. 300 దర్శనాలు రద్దుకు టీటీడీ నిర్ణయం

సారాంశం

తిరుమల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని సెప్టెంబర్ 27న  ఏపీ సీఎం వైఎస్ జగన్ శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 5వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. 


హైదరాబాద్: ఈ ఏడాది సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 5వ తేదీ వరకు తిరుమల వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. Tirumala Brahmotsavam ఏర్పాట్లను TTD అధికారులు గురువారం నాడు సమీక్షించారు.  

కరోనా తర్వాత తొలిసారిగా మాఢవీధుల్లో శ్రీవారి ఊరేగింపును నిర్వహించనున్నారు. Corona  కారణంగా మాఢ వీధుల్లో  బ్రహ్మోత్సవాల్లో  శ్రీవారి ఊరేగింపు నిర్వహించడం లేదు.అయితే ఈ దఫా మాఢ వీధుల్లో శ్రీవారి ఊరేగింపు నిర్వహించనున్నారు. 

also read:నిబంధనల ఉల్లంఘన: 140 మంది అనుచరులతో తిరుమలలో మంత్రి అప్పలరాజు ప్రోటోకాల్ దర్శనం

ఈ ఏడాది సెప్టెంబర్ 27న తిరుమల వెంకన్నకు  సీఎం వైఎస్ జగన్ పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు.  బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని  రూ. 300 దర్శనాలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకొన్నారు టీటీడీ అధికారులు.గరుడోత్సవరం రోజున టూ వీలర్స్ కు మాత్రం ఎంట్రీ ఇవ్వ కూడదని కూడా నిర్ణయించారు.బ్రహ్మోత్పవాలకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టుగా టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెప్పారు.

తిరుమల బ్రహ్మోత్సవాలకు ప్రారంభానికి సూచికగా సెప్టెంబర్ 26న ఉత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. బ్రహ్మోత్సవాల కోసం టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గత రెండేళ్లుగా కరోనాతో బ్రహ్మత్సవాలను ఏకాంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే. 

అక్టోబర్ 1న గరుడ సేవ, అక్టోబర్ 2న బంగారు రథం, అక్టోబర్ 4న మహారథం, అక్టోబర్ 5న చక్రస్నానం నిర్వహించనున్నారు.  రెండేళ్లుగా బ్రహ్మోత్సవాలకు భక్తులకు అనుమతివ్వలేదు. ఈ దఫా భక్తులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. దీంతో  భక్తుల రద్దీకి అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

గత రెండేళ్లుగా కరోనాతో బ్రహ్మత్సవాలను ఏకాంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 1న గరుడ సేవ, అక్టోబర్ 2న బంగారు రథం, అక్టోబర్ 4న మహారథం, అక్టోబర్ 5న చక్రస్నానం నిర్వహించనున్నారు.  రెండేళ్లుగా బ్రహ్మోత్సవాలకు భక్తులకు అనుమతివ్వలేదు. ఈ దఫా భక్తులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. దీంతో  భక్తుల రద్దీకి అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.  తొమ్మిది రోజులపాటు శ్రీవారి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. ప్రతి రోజూ రెండు వాహనాలపై స్వామివారిని ఊరేగించనున్నారు.  సెప్టెంబర్ 27న పెద్ద శేష వాహనం, సెప్టెంబర్ 28న చిన్నశేష వాహనంపై స్వామి వారు దర్శనం ఇవ్వనున్నారు.

బ్రహ్మోత్సవాలు జరిగే సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 5 వ తేదీ వరకు సర్వదర్శనం భక్తులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తామని టీటీడీ ఈవీ ధర్మారెడ్డి ప్రకటించారు. ప్రతి రోజూ ఉదయం 8 గంటట నుండి రాత్రి 7 గంటల వరకు శ్రీవారికి వాహన సేవలు నిర్వహిస్తామని ఈవో చెప్పారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని  సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కల్గించకుండా చర్యలు తీసుకొటామని అధికారలు తెలిపారు. 

బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ప్రతి రోజూ కనీసం 70 నుండి 80 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకొనే అవకాశం ఉందని ఈవో తెలిపారు.  కరోనా తర్వాత టీటీడీకి ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ఆదాయం వస్తున్న విషయం తెలిసిందే. బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ ఆదాయం మరింత పెరిగే అవకాశం లేకపోలేదని అధికారులు అంచనా వేస్తున్నారు.


 

PREV
click me!

Recommended Stories

Tirupati: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. తిరుప‌తి ప‌రిస‌ర ప్రాంతాల సంద‌ర్శ‌న‌కు ప్ర‌త్యేక ప్యాకేజీలు
Vegetables Price : దిగజారిన టమాటా, స్థిరంగా ఉల్లి... ఈ వీకెండ్ కూరగాయల రేట్లు ఇవే