ప్రోగ్రెస్ రిపోర్టులో వెనుకంజ.. జగన్ క్లాస్, గడప గడపకు కార్యక్రమంలో యాక్టీవ్‌గా ప్రసన్న కుమార్ రెడ్డి

Siva Kodati |  
Published : Jul 28, 2022, 03:05 PM IST
ప్రోగ్రెస్ రిపోర్టులో వెనుకంజ.. జగన్ క్లాస్, గడప గడపకు కార్యక్రమంలో యాక్టీవ్‌గా ప్రసన్న కుమార్ రెడ్డి

సారాంశం

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో యాక్టీవ్‌గా పాల్గొననున్నారు నెల్లూరు జిల్లా కొవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 20 వ తేదీ వరకు ప్రతిరోజూ గడప గడపకు కార్యక్రమం ఉండేలా ప్రసన్నకుమార్ రెడ్డి రూపకల్పన చేసుకున్నారు.   

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో (ap polls 2024) గెలిచి మరోసారి అధికారాన్ని అందుకోవాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ (ys jagan) గట్టి పట్టుదలతో వున్నారు. దీనిలో భాగంగా క్షేత్రస్థాయిలో పరిస్ధితులను తెలుసుకోవడంతో పాటు ఎమ్మెల్యేలపై వ్యతిరేకతను తగ్గించడానికి ఆయన ‘‘గడప గడపకు మన ప్రభుత్వం’’ (gadapa gadapaku mana prabhutvam) కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజల నుంచి నిరసన వ్యక్తమైనా సరే ప్రతి ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో విధిగా పాల్గొనాలని జగన్ ఆదేశించారు. దీనిపై పలుమార్లు వర్క్ షాప్ కూడా పెట్టారు సీఎం. అంతేకాదు .. గడప గడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యేల పనితీరుపై ప్రొగ్రెస్ కార్డును సైతం విడుదల చేసి క్లాసు పీకేవారు. ఇంత చేస్తున్నా పలువురు ఎమ్మెల్యేలు మాత్రం ఇంకా గడప గడపకు కార్యక్రమంలో పాల్గొనడం లేదు. 

దీంతో సీరియస్ అయిన జగన్.. ప్రజల్లో వుంటేనే టికెట్ ఇస్తానని తేల్చిచెప్పేశారు. ఇలా క్లాస్ పీకించుకున్న వారిలో నెల్లూరు జిల్లా కోవ్వూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి (nallapareddy prasanna kumar reddy) కూడా వున్నట్లు వైసీపీలో ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రసన్న కుమార్ రెడ్డి కూడా గడప గడపకు కార్యక్రమంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 20 వ తేదీ వరకు ప్రతిరోజూ గడప గడపకు కార్యక్రమం ఉండేలా ప్రసన్నకుమార్ రెడ్డి రూపకల్పన చేసుకున్నారు. తన నియోజకవర్గం పరిధిలోని బుచ్చిరెడ్డి పాలెం, ఇందుకూరు పేట, కోవూరు, కొడవలూరు, విడవలూరు మండలాల్లో జరిగే గడప గడపలో ఆయన పాల్గొననున్నారు. ఈ మేరకు పార్టీ కేడర్‌కు కూడా ఎమ్మెల్యే సమాచారం అందించారు. మొత్తం మీద జగన్ క్లాస్‌తో ప్రసన్న కుమార్ రెడ్డి దారిలోకి వచ్చారని నెల్లూరు జిల్లా వైసీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. 

Also Read:2024లో విజయమే లక్ష్యం.. ఇకపై నియోజకవర్గానికి 50 మంది కార్యకర్తలతో భేటీ , త్వరలో కార్యాచరణ : జగన్

ఇకపోతే... గత శుక్రవారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో ఆర్డినేటర్లతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆగస్ట్ 4 నుంచి ప్రతి నియోజకవర్గంలో 50 మంది కార్యకర్తలతో భేటీ అవుతానని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి త్వరలోనే ప్రణాళిక ప్రకటిస్తానని సీఎం తెలిపారు. పార్టీ కార్యకర్తలు, జిల్లా పార్టీ అధ్యక్షులు క్రియాశీలకంగా పనిచేయాలని.. ఎవరి బాధ్యతలను వారు పూర్తిగా నిర్వర్తించాలని జగన్ దిశానిర్దేశం చేశారు. 

వారి సొంత నియోజకవర్గాలతో పాటు.. పార్టీ అప్పగించిన బాధ్యతలను కూడా చూసుకోవాలన్నారు. పార్టీ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు క్షేత్రస్థాయిలో పర్యటించి గడప గడపకు కార్యక్రమాన్ని సమీక్షించాలని జగన్ పేర్కొన్నారు. నెలలో ఆరు సచివాలయాల పరిధిలో గడప గడపకూ కార్యక్రమం జరిగేలా చూడాలని సీఎం ఆదేశించారు. సమర్ధంగా పనిచేస్తే మళ్లీ గెలవడం అసాధ్యం కాదని.. ప్రతి సచివాలయానికి త్వరలో రూ.20 లక్షల నిధులు విడుదల చేస్తున్నట్లు జగన్ చెప్పారు. జిల్లా, మండల, నగర కమిటీలను త్వరగా ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. బూత్ కమిటీ నుంచి ప్రతి కమిటీలోనూ మహిళలకు ప్రాధాన్యత వుండాలని జగన్ దిశానిర్దేశం చేశారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్