ఐదు పెళ్లిళ్లు చేసుకొన్న ఎన్ఆర్ఐ సతీష్ బాబు:ఐదో భార్య ఫిర్యాదుతో అరెస్ట్

By narsimha lode  |  First Published Jul 28, 2022, 3:39 PM IST

ఐదు పెళ్లిళ్లు చేసుకొన్న ఎన్ఆర్ఐ కర్నాటి సతీష్ బాబును అతని తండ్రి వీరభద్రరావును గుంటూరు పోలీసులు గురువారం నాడు అరెస్ట్ చేశారు. ఒకరికి తెలియకుండా మరోకరిని పెళ్లి చేసుకొన్నాడని బాధితులు చెబుతున్నారు.


గుంటూరు: ఐదు పెళ్లిళ్లు చేసుకొన్న NRI  కర్నాటి Satish Babu ను అతని తండ్రి  వీరభద్రరావును గుంటూరు పోలీసులు  గురువారం నాడు Arrest చేశారు. సతీష్ పై గతంలోనే రెండు కేసులు నమోదైనట్టుగా పోలీసులు చెబుతున్నారు.

ఈ ఏడాది జూన్ 16న ఓ యువతిని సతీష్  వివాహం చేసుకొన్నాడు. ఈ నెల 2వ తేదీన సతీష్ బాబు పెళ్లిళ్ల విషయం ఆ యువతికి తెలిసింది. సతీష్ బాబు ఫోన్లో రెండో భార్యతో చేసిన చాటింగ్ వ్యవహరం చూసిన బాధత యువతి భర్త సతీష్ బాబును నిలదీసింది. తొలుత ఈ విషయమై సతీష్ బాబు బుకాయించినట్టుగా బాధితురాలు  మీడియాకు తెలిపింది.

Latest Videos

 తన భర్త వ్యాపారాల విషయమై గూగుల్ లో సెర్చ్ చేస్తే అతనిపై నమోదైన కేసులు భార్యల విషయమై తనకు మరింతగా తెలిసిందని బాధితురాలు వివరించారు. ఈ విషయమై  తన భర్త పేరేంట్స్  అడిగితే రెండో పెళ్లి గురించి చెప్పారన్నారు.  ఈ విషయమై తాను తన భర్తను నిలదీస్తే తనతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానని బెదిరింపులకు పాల్పడినట్టుగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఆరోపించారు.ఈ వేధింపులు భరించలేక పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా ఆమె మీడియాకు తెలిపారు. 

తన భర్త గతంలో తనకు జరిగిన పెళ్లిళ్ల విషయాలను దాచి పెట్టి మోసం చేసి తనను పెళ్లి చేసుకొన్నాడని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.ఈ విషయమై దిశ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసింది. ఎన్ఆర్ఐ సతీష్ బాబును దిశ పోలీసులు అరెస్ట్ చేశారు. 

also read:నలుగురు బిడ్డల తల్లి.. 15యేళ్ల బాలుడితో జంప్.. వివాహేతర సంబంధం కోసం దారుణం, చివరకు...

ఒకరి కంటే ఎక్కువ మందిని పెళ్లిళ్ల పేరుతో మోసం చేసిన ఘటనలు వెలుగు చూస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా ఘటనలకు సంబంధించి కేసులు నమోదౌతున్నాయి. ఎనిమిది మంది వివాహం చేసుకొన్న ఆరోపణలతో శివశంకర్ బాబు అనే వ్యక్తిని ఈ నెల 14న పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను శివశంకర్ బాబు ఖండించారు. అయితే బాధిత మహిళల ఫిర్యాదు మేరకు శివశంకర్ బాబును పోలీసులు అరెస్ట్ చేశారు.  పెళ్లి చేసుకొన్న మహిళల నుండి డబ్బులు తీసుకొని తప్పించుకొని తిరిగేవాడని కూడా బాధితులు తెలిపారు.ఈ విషయమై బాధిత మహిళలు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. అంతేకాదు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. 

మరో వైపు ఓ మహిళ కూడా తన వయస్సు కన్పించకుండా మేకప్  వేసుకొని తన వయస్సును దాచి పెట్టి పెళ్లి చేసుకొన్న ఘటన ఇటీవలనే వెలుగు చూసింది. 50 ఏళ్ల మహిళ మేకప్ సమాయంతో తన వయస్సును  దాచి పెట్టి పెళ్లి చేసుకొంది.ఈ మహిళ విషయం తెలిసిన  బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మహిళకు అప్పటికే రెండు పెళ్లిళ్లు అయినట్టుగా పోలీసులు గుర్తించారు. 

click me!