ఎట్టకేలకు మడకశిర ఎమ్మెల్యేగా తిప్పేస్వామి: విజయోత్సవంలో వైసీపీ

By Nagaraju TFirst Published Dec 19, 2018, 10:57 AM IST
Highlights

ఎట్టకేలకు మడకశిర నియోజకవర్గం వైసీపీ సమన్వయ కర్త విజయం సాధించారు. తాను మడకశిర ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చెయ్యాలనుకున్న కలను సాకారం చేసుకున్నారు. మడకశిర ఎమ్మెల్యేగా ఈరన్న రాజీనామా చేసినా తిప్పేస్వామి ప్రమాణస్వీకారంపై సందిగ్ధతన తెలకొంది. 
 

అమరావతి: ఎట్టకేలకు మడకశిర నియోజకవర్గం వైసీపీ సమన్వయ కర్త విజయం సాధించారు. తాను మడకశిర ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చెయ్యాలనుకున్న కలను సాకారం చేసుకున్నారు. మడకశిర ఎమ్మెల్యేగా ఈరన్న రాజీనామా చేసినా తిప్పేస్వామి ప్రమాణస్వీకారంపై సందిగ్ధతన తెలకొంది. 

అయితే వాటన్నంటికి స్వస్తి చెప్తూ తిప్పేస్వామి నిర్ణయించిన ముహూర్తానికే అంటే బుధవారం ఉదయమే ప్రమాణ స్వీకారానికి స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రమాణ స్వీకారం చేయించారు. అమరావతి అసెంబ్లీలో స్పీకర్ తన కార్యాలయంలో తిప్పేస్వామి చేత ప్రమాణం చేయించారు. 
 
తిప్పేస్వామి ప్రమాణ స్వీకారోత్సవానికి వైసీపీ నేతలు అంబటి రాంబాబు, పార్థసారథి, మల్లాది విష్ణు హాజరయ్యారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఈరన్న.. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో తనపై ఉన్న క్రిమినల్‌ కేసులతోపాటు కుటుంబసభ్యుల ప్రభుత్వ ఉద్యోగాల గురించి ప్రస్తావించలేదని వైసీపీ అభ్యర్థి తిప్పేస్వామి హైకోర్టును ఆశ్రయించారు. 

దీన్ని విచారించిన హైకోర్టు తిప్పేస్వామి వాదనను సమర్థిస్తూ ఈరన్న ఎన్నిక చెల్లదని తీర్పునిచ్చింది. దీన్ని సవాల్‌ చేస్తూ ఈరన్న సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. విచారణ జరిపిన ధర్మాసనం హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈరన్న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 

ఈరన్న రాజీనామాతో తనతో ఈనెల 20న ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించాలంటూ తిప్పేస్వామి అసెంబ్లీ స్పీకర్ ను కోరారు. హైకోర్టు, సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రతులను వైసీపీ నేతలు ఏపీ అసెంబ్లీ కార్యదర్శి విజయరాజుకి అందజేశారు. దీంతో బుధవారం తిప్పేస్వామి ఎమ్మెల్యేగా ప్రమాణం స్వీకారం చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి

రాజీనామా ఎత్తు; ఈరన్న తెలివి, తిప్పేస్వామి తిప్పలు

టీడీపీకి షాక్: ఎమ్మెల్యే రాజీనామా

టీడీపీ ఎమ్మెల్యేకు హైకోర్టు షాక్, ఎన్నిక చెల్లదంటూ తీర్పు

click me!