విశాఖలో ఉద్రిక్తత:కార్మికుల బైక్ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు, రోడ్డుపై బైఃఠాయింపు

By narsimha lodeFirst Published Nov 9, 2022, 10:03 AM IST
Highlights

విశాఖపట్టణం స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించవద్దని కోరుతూ కార్మిక సంఘాలు తలపెట్టిన బైక్ ర్యాలీని పోలీసులుఅడ్డుకున్నారు.స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ వద్ద కార్మికులు ప్లకార్డులతో నిరసన చేపట్టారు.

విశాఖపట్టణం:విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించవద్దని కోరుతూ కార్మిక సంఘాల జేఏసీ ఆద్వర్యంలో కార్మికులు,ఉద్యోగులు బుధవారంనాడు నిరసనకు దిగారు.కార్మికుల బైక్ ర్యాలీకి పోలీసులు అనుమతి లేదని  ప్రకటించారు.మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ వద్ద కార్మికులు ప్లకార్డులు చేతబూని ఆందోళన నిర్వహించారు.

విశాఖపట్టణం స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించవద్దని కోరుతూ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో 636 రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 11,12 తేదీల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖపట్టణానికి రానున్నారు.దీంతో  కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఇవాళ బైక్ ర్యాలీకి కార్మిక సఃంఘాలు తలపెట్టాయి. కూర్మన్నపాలెం జంక్షన్ నుండి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ర్యాలీ చేయాలని కార్మికసంఘాలు తలపెట్టాయి.ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపైనే బైఠాయించి కార్మికులు ఆందోళనకు దిగారు. ఈ  సమయంలో పోలీసులకు కార్మికులకు మధ్య  తోపులాట చోటుచేసుకుంది.

విశాఖపట్టణం స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధులు కేంద్రంపై ఒత్తిడి తేవాలని కార్మిక సంఘాల జేఏపీ డిమాండ్ చేస్తుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను  ప్రైవేటీకరించవద్దని ఏపీ రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకత్వం కూడా కోరుతుంది.ఈ విషయమై  జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినట్టుగా ఆ పార్టీ నేతలు గతంలో ప్రకటించారు.కానీ కేంద్రం మాత్రం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై  వెనక్కు తగ్గబోమని  తేల్చి చెప్పింది.కేంద్రంపై  ఒత్తిడి తెచ్చేందుకుగాను కార్మిక సంఘాల  జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలుచేస్తున్నారు.ఈ నెల 11,12 తేదీల్లో విశాఖపట్టణానికి  వచ్చే ప్రధాని మోడీని ఈ  విషయమై  నిరసనకు దిగాలని కార్మిక సంఘాలు భావిస్తున్నాయి.
 

click me!