బాత్రూం కిటికీలోంచి... విశాఖలో ముగ్గురు మహిళల మిస్సింగ్

By Arun Kumar PFirst Published Jul 1, 2021, 11:48 AM IST
Highlights

 ఆంధ్ర ప్రదేశ్ మహిళా, శిశు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో నడుస్తున్న స్వదార్ మహిళా పునరావాస కేంద్రం నుండి ముగ్గురు మహిళలు పరారయ్యారు. 

విశాఖపట్నం: కట్టుదిట్టమైప భద్రత వుండే పునరావాస కేంద్రం నుండే ముగ్గురు మహిళలు తప్పించుకుని పారిపోయారు.  ఆంధ్ర ప్రదేశ్ మహిళా, శిశు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో నడుస్తున్న స్వదార్ మహిళా పునరావాస కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు మహిళలు బాత్రూమ్ కిటికీ గ్రిల్స్ తొలగించి పారిపోయారు. 

వివరాల్లోకి వెళితే... విశాఖపట్నంలోని పైనాపిల్ కాలనీలో  మహిళా, శిశు అభివృద్ధి శాఖ స్వదార్ మహిళా పునరావాస కేంద్రం నిర్వహిస్తోంది. ఈ కేంద్రం నుండి ముగ్గురు మహిళలు తప్పించుకుని పరారయ్యారు. బాత్రూం కిటికీలోంచి వీరు తప్పించుకోగా వీరిని గమనించిన మిగతా మహిళలు గట్టిగా కేకలు వేశారు. అయితే అప్పటికే పునరావాస కేంద్ర నుండి పూర్తిగా బయటకు వెళ్లిపోయిన మహిళలు ఓ ఆటోలో పరారయ్యారు. 

read more  భర్త వదిలేసిన మహిళ తో ఎఫైర్.. ఆమె కూతురిపైనా కన్నేసి..!

ముగ్గురు మహిళల పరారీ విషయం తెలుసుకున్న ప్రగతి కేంద్రం డిప్యూటీ మేనేజర్ రామకుమారి, పర్యవేక్షకురాలు నాగేశ్వరీ అరిలోవ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తప్పించుకున్న మహిళలు పీతల వరలక్ష్మి, బంగారు శైలజ (స్నేహాలత), ఆర్తీ గా గుర్తించారు. వీరి కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. 

పరారయిన ముగ్గురు మహిళల్లో ఒకరు ఇటీవల మారికవలసలో హత్యకు గురైన చిన్నారి సింధుశ్రీ తల్లి. చిన్నారిని హత్య చేయడంతో ప్రియుడు జైలుకెళ్ళాడు. కుటుంబానికి దూరమైన ఆ మహిళను పోలీసులు స్వధార్ హోంలో పెట్టారు. దాదాపు నెలరోజులుగా ఆమె ఇక్కడే ఆశ్రయం పొందుతోంది. ఇప్పుడు మరో ఇద్దరితో కలిసి తప్పించుకుని పారిపోయింది.

click me!