నా పుట్టినరోజున అలా చేయకండి... దయచేసి సహకరించండి: వైసిపి శ్రేణులతో విజయసాయి

Arun Kumar P   | Asianet News
Published : Jul 01, 2021, 10:43 AM IST
నా పుట్టినరోజున అలా చేయకండి... దయచేసి సహకరించండి: వైసిపి శ్రేణులతో విజయసాయి

సారాంశం

కొందరు పార్టీ నాయకులు, కార్యకర్తలు అత్యుత్సాహంతో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటుచేయడం, ప్రకటనలు ఇచ్చినట్లు తన దృష్టికి వచ్చిందని... ఇలా హడావుడి చేయవద్దని వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి వైసిపి శ్రేణులను కోరారు.

విశాఖపట్నం: తన పుట్టినరోజు సందర్భంగా ఎటువంటి హడావిడి, ఆడంబరాలు చేయవద్దని వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు.  కొందరు పార్టీ నాయకులు, కార్యకర్తలు అత్యుత్సాహంతో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటుచేయడం, ప్రకటనలు ఇచ్చినట్లు తన దృష్టికి వచ్చిందని... ఇలా హడావుడి చేయవద్దని వారందరికీ వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. చేతనైనంత మేరకు కరోనా బాధితులను ఆదుకోండి అని విజయసాయి రెడ్డి సూచించారు. . 

''పుట్టినరోజు సందర్భంగా నన్ను ఆశీర్వదిస్తున్న అందరకీ సర్వదా కృతజ్ఞుడిని. కరోనా నేపథ్యంలో మన సోదర సోదరీమణులు అనేక రకాల ఇబ్బందుల్లో ఉన్నారు. వారందరికీ సాంత్వన కలిగించడం మన తక్షణ కర్తవ్యం. ఫ్లెక్సీ లు, ప్రకటనలు, ఆడంబరాలతో కాకుండా ఆపదలో ఉన్నవారిని అదుకుంటారని ఆశిస్తున్నాను'' అంటూ ట్వీట్టర్ వేదికన తన అనుచరులు, అభిమానులు, వైసిపి నాయకులు, కార్యకర్తలకు విజయసాయి రెడ్డి పిలుపునిచ్చారు. 

''పుట్టినరోజు వేడుకలకు నేను సహజంగానే దూరం. ఇలాంటి సందర్భాలలో మనం హడావిడి అస్సలు చేయకూడదు. అర్థం చేసుకుని సహకరిస్తారని, మీ ఆశీస్సులు ఎల్లవేళలా నాకుంటాయని ఆశిస్తున్నాను''  అని వైసిపి శ్రేణులకు సూచించారు విజయసాయి రెడ్డి.  

PREV
click me!

Recommended Stories

Deputy CM Pawan Kalyan Powerful Speech: నా జోలికొస్తే ఊరుకోను నేను అన్నీ తెగించా | Asianet Telugu
Mangrove Initiative National Workshop: దేశం అంతటా ఈ వర్కుషాప్స్ నిర్వహిస్తాం | Asianet News Telugu