విశాఖలో ముగ్గురు విద్యార్థుల మిస్సింగ్ కలకలం..

Published : Jun 27, 2023, 11:08 AM IST
విశాఖలో ముగ్గురు విద్యార్థుల మిస్సింగ్ కలకలం..

సారాంశం

విశాఖపట్నంలో ముగ్గురు విద్యార్థులు మిస్సింగ్ ఘటన కలకలం రేపుతోంది. ఈ నెల 24వ తేదీన కే కోటపాడుకు వెళ్లిన ముగ్గురు ఇంటర్ విద్యార్థులు.. తిరిగి వారి ఇళ్లకు చేరుకోలేదు.

విశాఖపట్నంలో ముగ్గురు విద్యార్థులు మిస్సింగ్ ఘటన కలకలం రేపుతోంది. ఈ నెల 24వ తేదీన కే కోటపాడుకు వెళ్లిన ముగ్గురు ఇంటర్ విద్యార్థులు.. తిరిగి వారి ఇళ్లకు చేరుకోలేదు. కే కోటపాడు నుంచి తిరుగు పయనం అయినప్పటికీ ఇంటికి చేరుకోకపోవడంతో విద్యర్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు  చేసిన గాజువాక పోలీసులు.. విద్యార్థుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఇప్పటివరకు వారి ఆచూకీ లభించలేదని పోలీసు వర్గాలు తెలిపాయి. 

Also Read: హైదరాబాద్‌లో స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం.. ఆమెదే కీలక పాత్ర.. అపార్ట్‌మెంట్‌లో గుట్టు చప్పుడు కాకుండా..!!

అయితే కనిపించకుండా పోయిన ముగ్గురు విద్యార్థులు కూడా స్నేహితులు. ముగ్గురు కూడా మైనర్లే. వీరిలో ఇద్దరు చిన్నప్పటి నుంచే స్నేహితులు కాగా.. మరో వ్యక్తి కొంతకాలం క్రితం వీరికి స్నేహితుడిగా మారారు. ఈ క్రమంలోనే స్నేహితులైన ముగ్గురు విద్యార్థులు.. ఉద్దేశపూర్వకంగానే ఎక్కడికైనా వెళ్లారా? అనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. అలాగే ఏదైనా ప్రమాదానికి గురయ్యారా? అనే కోణంలో కూడా ఆరా తీస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు..ఏపీలో వర్షాలు స్టార్ట్ | Asianet News Telugu
Weather Update : బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు.. మరి వర్షాలు ఎక్కడ? ఎప్పట్నుంచి కురుస్తాయి?